జగన్ పాలనకు మూడింది
కూటమిదే పక్కా విజయం
మంగళగిరి – ఏపీలో జగన్ మోహన్ రెడ్డి అరాచక పాలనకు మూడిందంటూ సంచలన కామెంట్స్ చేశారు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు. తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమి నిర్వహించిన ప్రజా గళం సభ సక్సెస్ అయ్యిందని తెలిపారు. తాము తప్పకుండా రాష్ట్రంలో అధికారంలోకి వస్తామని ఇందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదన్నారు.
ఇదిలా ఉండగా మంగళగిరి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీలో భారీ ఎత్తున వలసలు పెరిగాయి. నారా లోకేష్ సమక్షంలో పలువురు పసుపు కండువా కప్పుకున్నారు. పట్టణ ప్రముఖ నేత ఆకురాతి నాగేంద్రం తో పాటు 200 కుటుంబాలు టీడీపీలో చేరారు. వారందరీని అభినందించారు లోకేష్.
ఈ సందర్బంగా ప్రసంగించారు. ఏపీలో అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేసిన ఘనత సీఎం జగన్ రెడ్డికే దక్కుతుందన్నారు. నవ రత్నాల పేరుతో జనం చెవుల్లో పూలు పెట్టారని, ఎన్ని వ్యూహాలు పన్నినా, మరెన్ని కుట్రలు చేసినా జగన్ రెడ్డి ఇంటికి వెళ్లడం ఖాయమని జోష్యం చెప్పారు నారా లోకేష్ బాబు.