మేమొస్తే హనుమ విహారికి సపోర్ట్
ప్రకటించిన నారా లోకేష్
అమరావతి – తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. భారతీయ క్రికెట్ రంగంలో కీలక ఆటగాడుగా ఉన్న ఏపీకి చెందిన హనుమ విహారి తాను ఆడలేనంటూ ప్రకటించడంపై ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై స్పందించిన నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. అధికారంలో కొలువు తీరిన వైసీపీ సర్కార్ నిర్వాకం కారణంగా ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ లో రాజకీయాలు చోటు చేసుకున్నాయని వాపోయారు.
ఇంకా రెండు నెలలు పూర్తయితే తెలుగుదేశం , జనసేన పార్టీ కూటమి పవర్ లోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. తాము పవర్ లోకి వచ్చిన వెంటనే హనుమ విహారికి రెడ్ కార్పెట్ పరుస్తామని హామీ ఇచ్చారు. రంజీ ట్రోఫీని గెలిచేందుకు అవసరమైన ప్రతి సహాయాన్ని అందిస్తామని, ఇందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదన్నారు.
ఏపీలో నీచపు రాజకీయాలకు పాల్పడుతున్న చరిత్ర జగన్ రెడ్డిదని మండిపడ్డారు. క్రీడాకారులను తమ స్వార్థ పాలిటిక్స్ కు బలి చేశారంటూ ధ్వజమెత్తారు నారా లోకేష్.