NEWSANDHRA PRADESH

అన్నామ‌లై కోసం లోకేష్ ప్ర‌చారం

Share it with your family & friends

కోయంబ‌త్తూరు స‌భ‌కు హాజ‌రు

అమ‌రావ‌తి – ఎన్డీఏలో భాగ‌స్వామి అయిన తెలుగుదేశం పార్టీ త‌ర‌పున ఎన్నిక‌ల ప్ర‌చారంలో పాల్గొనేందుకు త‌మిళ‌నాడుకు వెళ్ల‌నున్నారు ఆ పార్టీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేష్ . కోయంబ‌త్తూరు లోక్ స‌భ స్థానం నుంచి భార‌తీయ జ‌న‌తా పార్టీ రాష్ట్ర అధ్య‌క్షుడు కె. అన్నామ‌లై కుప్పుస్వామి బ‌రిలో ఉన్నారు.

ఆయ‌న‌కు మ‌ద్ద‌తుగా ప్ర‌చారం చేసేందుకు వెళ్ల‌నున్నారు నారా లోకేష్. తెలుగు వారు ఎక్కువ‌గా స్థిర‌ప‌డిన ప్రాంతాల‌లో ఈ మేర‌కు ప్ర‌చారం చేయ‌నున్నారు. గురువారం రాత్రి పీల‌మేడు ప్రాంతంలో బీజేపీ ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హించే బ‌హిరంగ స‌భ‌లో పాల్గొంటారు లోకేష్‌.

12న శుక్ర‌వారం ఉద‌యం 8 గంట‌ల‌కు సింగనల్లూర్ ఇందిరా గార్డెన్స్ లో తెలుగు ప్రాంతానికి చెందిన పారిశ్రామికవేత్తలతో సమావేశం అవుతారు టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి. ఈ సంద‌ర్బంగా కె. అన్నామలై విజయానికి సహకరించాలని కోరనున్నారు.

యూపీఏలో భాగ‌స్వామ్యానికి గుడ్ బై చెప్పిన చంద్ర‌బాబు తాజాగా మోదీతో చేతులు క‌లిపారు. ప్ర‌స్తుతం ఎన్డీయేలో భాగ‌స్వామిగా ఉన్నారు. దీంతో ఇరు పార్టీల‌కు చెందిన నేత‌లు ప‌ర‌స్ప‌రం స‌పోర్ట్ చేసుకునే ప‌నిలో ప‌డ్డారు.