రామోజీరావు అక్షర యోధుడు
ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి
అమరావతి – ఈనాడు సంస్థల అధిపతి చెరుకూరి రామోజీరావు ఇక లేరన్న వార్త తనను ఎంతో దిగ్భ్రాంతికి గురి చేసిందని పేర్కొన్నారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. శనివారం తెల్లవారుజామున రామోజీ రావు కన్నుమూశారు. ఆయన లేని లోటు తెలుగు వారికే కాకుండా యావత్ దేశానికి కూడా తీరని నష్టం అని పేర్కొన్నారు.
ఒక సామాన్య కుటుంబంలో పుట్టి అసామాన్య విజయాలు సాధించిన రామోజీరావు మరణం తీవ్ర ఆవేదనకు గురి చేసిందన్నారు అక్షర యోధుడుగా రామోజీ తెలుగు రాష్ట్రాలకు, దేశానికి ఎన్నో సేవలు అందించారని కొనియాడారు.
తెలుగు వారి జీవితాల్లో అత్యంత ప్రభావవంతమైన ముద్ర వేసిన రామోజీరావు తెలుగు ప్రజల ఆస్తి అని స్పష్టం చేశారు. సమాజ హితం కోసం అనుక్షణం పనిచేసిన ఆయన కీర్తి అజరామరమని, ఈనాడు గ్రూపు సంస్థల స్థాపనతో వేల మందికి ఉపాధి కల్పించారని తెలిపారు.