యువ నేత సంచలన నిర్ణయం
అమరావతి – ఏపీ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రిగా కొలువు తీరిన నారా లోకేష్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఆయన దూకుడు పెంచారు. తిరుమలను దర్శించుకున్న అనంతరం పదవీ బాధ్యతలు చేపట్టారు మంత్రిగా. అనంతరం రంగంలోకి దిగారు.
శనివారం ఏకంగా మంగళగిరిలో తన నివాసంలో ప్రజా దర్బార్ ను చేపట్టారు. అపరిష్కృతంగా ఉన్న సమస్యల పరిష్కారం కోసం శ్రీకారం చుట్టారు. ఈ మేరకు పలువురు క్యూ కట్టారు. తమ ఆర్జీలను లోకేష్ కు అందజేశారు.
ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను తప్పకుండా అమలు చేస్తామని ప్రకటించారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన పని లేదన్నారు. గతంలో ఉన్న సర్కార్ తీవ్ర ఇబ్బందులకు గురి చేసిందన్నారు. కానీ తమ ప్రభుత్వం కొలువు తీరిందని, ప్రజా పాలన కొనసాగుతుందన్నారు నారా లోకేష్.
ఇదిలా ఉండగా నియోజకవర్గ ప్రజలు తమ దృష్టికి తెచ్చే సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించడానికి వీలుగా ప్రత్యేక యంత్రాంగాన్ని సైతం ఏర్పాటు చేశారు. గతంలో ఓడి పోయినా సొంత నిధులతో 29 సంక్షేమ కార్యక్రమాలను అమలు చేసి మంగళగిరి ప్రజల మనసు గెలిచారు. నియోజకవర్గ ప్రజల ఆశీస్సులతో విజయదుందుభి మోగించిన లోకేష్… ప్రజలకు మరింత చేరువగా వెళ్లేందుకు ప్రజాదర్బార్ నిర్వహించాలని నిర్ణయించారు.