Thursday, April 24, 2025
HomeNEWSANDHRA PRADESHనారా లోకేష్ ప్ర‌జా ద‌ర్బార్

నారా లోకేష్ ప్ర‌జా ద‌ర్బార్

29వ రోజుకు చేరుకున్న కార్య‌క్ర‌మం

అమ‌రావ‌తి – ఓ వైపు మంత్రిగా బిజీగా ఉంటూనే మ‌రో వైపు ప్ర‌జ‌లు ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించే ప‌నిలో ప‌డ్డారు ఏపీ విద్యా, ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి నారా లోకేష్. ఆయ‌న ఎన్నిక‌ల సంద‌ర్భంగా ఇచ్చిన హామీ మేర‌కు ప్ర‌జా ద‌ర్బార్ నిర్వ‌హిస్తూ వ‌స్తున్నారు.

ఇవాళ కూడా త‌న ఉండ‌వ‌ల్లి లోని నివాసంలో ప్ర‌జా ద‌ర్బార్ చేప‌ట్టారు నారా లోకేష్ . బుధ‌వారం నాటికి ఆయ‌న చేపట్టిన ఈ కార్య‌క్ర‌మం 29వ రోజుకు చేరుకుంది. ఇవాళ వ‌చ్చిన ఫిర్యాదులు ఎక్కువ‌గా వైసీపీ హ‌యాంలో జ‌రిగిన ఆక్ర‌మ‌ణ‌లు, క‌బ్జాల‌తో భూ వివాదాలకు సంబంధించిన‌వి వ‌చ్చాయి.

రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు తరలి వచ్చి తమ సమస్యలను మంత్రి నారా లోకేష్ కు విన్నవించారు. పెన్షన్లు మంజూరు చేయించాలని, వైద్యానికి ఆర్థిక సాయం చేయాలని, భూ కబ్జాదారులను తరిమి వేయాలని కోరారు.

సొంతింటి కల నెర వేర్చాలని, విద్య, ఉద్యోగ సమస్యలు పరిష్కరించాలని మంత్రి నారా లోకేష్ ను కలిసి విజ్ఞప్తి చేశారు. ఆయా విన్నపాలను పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments