బాధితులకు భరోసా నారా లోకేష్ ఆసరా
24వ రోజుకు చేరుకున్న ప్రజా దర్బార్
అమరావతి – తమ సమస్యలు చెప్పుకునేందుకు పోటెత్తారు బాధితులు ఏపీ ఐటీ, విద్యా, కమ్యూనికేషన్స్ శాఖ మంత్రి నారా లోకేష్ చేపట్టిన ప్రజా దర్బార్ కు. ఆయన ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఉండవల్లి లోని తన నివాసంలో ప్రజా దర్బార్ ను చేపట్టారు. అంతకు ముందు మంగళగిరి నియోజకవర్గాన్ని దేశంలోనే నెంబర్ వన్ గా చేస్తానని మాటిచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం తను అభివృద్దిపై ఫోకస్ పెట్టారు.
ఇదే సమయంలో నారా లోకేష్ వద్దకు తాను ప్రాతినిధ్యం వహిస్తున్న మంగళగిరి నియోజకవర్గంలోని ప్రజలే కాకుండా రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల నుండి కూడా బాధితులు తనను కలిసేందుకు క్యూ కడుతున్నారు.
ఇదిలా ఉండగా తాను చేపట్టిన ప్రజా దర్బార్ సోమవారం నాటికి 24 రోజులకు చేరుకుంది. తమ సమస్యలను మంత్రి దృష్టికి తీసుకు వచ్చారు. ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని నారా లోకేష్ భరోసా ఇచ్చారు.
ఆయా శాఖలకు సంబంధించిన సమస్యలను ఉన్నతాధికారులకు పంపించారు. వెంటనే పరిష్కరించాలని సూచించారు ఏపీ మంత్రి. జవాబుదారీతనం అన్నది తమ ప్రభుత్వ లక్ష్యమని ఈ సందర్బంగా స్పష్టం చేశారు నారా లోకేష్.