ఏపీ మంత్రి నారా లోకేష్
అమరావతి – ఏపీ స్పీకర్ గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు చింతకాయల అయ్యన్న పాత్రుడు. ఈ సందర్బంగా శాసన సభలో ఏపీ ఐటీ, కమ్యూనికేషన్స్ శాఖ మంత్రి నారా లోకేష్ స్పందించారు. అయ్యన్న పాత్రుడు రాజకీయ పరంగా ఎంతో అనుభవం కలిగిన నాయకుడు అని కొనియాడారు. ఆయన స్పీకర్ గా ఎన్నిక కావడం సంతోషంగా ఉందన్నారు. శాసన సభ హుందా తనం మరింత పెంచేలా చేస్తారని , ఆ నమ్మకం తనకు ఉందన్నారు నారా లోకేష్.
ఇదే సమయంలో ఇక్కడ ప్రతిపక్షలేక పోవడం దారుణమన్నారు. కనీసం శాసన సభా సంప్రదాయం పాటించక పోవడం బాధ కలిగించిందన్నారు. ప్రజా సమస్యలు వినిపించే ప్రతిపక్ష బాధ్యత కూడా తామే తీసుకుంటామన్నారు నారా లోకేష్.
అపారమైన అనుభవం కలిగిన అయ్యన్న పాత్రుడుతో కలిసి పని చేయడం అదృష్టంగా భావిస్తున్నట్లు చెప్పారు. వైసీపీ హయాంలో కక్షగట్టి అయ్యన్న ఇంటిని కూల గొట్టినా, కేసులు పెట్టినా తగ్గకుండా పోరాడారని కొనియాడారు.
ఒకే పార్టీ, ప్రజలే అజెండాగా అయ్యన్న పాత్రుడు ముందుకు వెళ్లారని ప్రశంసించారు నారా లోకేష్.