జెస్సీ రాజ్ కు లోకేష్ కంగ్రాట్స్
క్రీడాకారులకు ప్రభుత్వం చేయూత
అమరావతి – రాష్ట్ర ఐటీ , కమ్యూనికేషన్స్ శాఖ మంత్రి నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. ట్విట్టర్ వేదికగా బుధవారం ఆయన స్పందించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన జెస్సీ రాజ్ ను ప్రత్యేకంగా అభినందనలతో ముంచెత్తారు.
ఆమె స్వస్థలం విజయవాడ. తాజాగా న్యూజిలాండ్ లో జరిగిన ప్రపంచ ఓషియానిక్ రోలర్ స్కేటింగ్ ఛాంపియన్ షిప్ లో పాల్గొంది. ఈ పోటీలలో భారత దేశం నుంచి ప్రాతినిధ్యం వహించింది జెస్సీ రాజ్. అత్యున్నతమైన ప్రదర్శనతో ఆకట్టుకుంది. అంతే కాకుండా టాప్ లో నిలిచింది. బంగారు పతకాన్ని సాధించింది.
దీనిని పురస్కరించుకుని పసిడి పతకాన్ని గెలుపొందిన జెస్సీ రాజ్ కు నారా లోకేష్ కంగ్రాట్స్ తెలిపారు. ఆమెను ప్రభుత్వం తరపున సన్మానం చేస్తామని, తను కోరుకున్న విధంగా మరింత సహాయ సహకారాలు అందజేస్తామని వెల్లడించారు ఐటీ, కమ్యూనికేషన్స్ శాఖ మంత్రి.