NEWSANDHRA PRADESH

క‌ల్కి స‌క్సెస్ లోకేష్ కంగ్రాట్స్

Share it with your family & friends

ప్ర‌పంచ వ్యాప్తంగా పాజిటివ్ టాక్

అమ‌రావ‌తి – చ‌ల‌సాని అశ్వ‌నీద‌త్ నిర్మాణంలో నాగ్ అశ్విన్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ప్ర‌భాస్ , దీపికా ప‌దుకొనే క‌లిసి న‌టించిన క‌ల్కి చిత్రం గురువారం ప్ర‌పంచ వ్యాప్తంగా భారీ అంచ‌నాల మధ్య విడుద‌లైంది. ఈ సినిమాను హాలీవుడ్ రేంజ్ లో తీశాడు నాగ్ అశ్విన్. ఆయ‌న గ‌తంలో మ‌హాన‌టి సినిమా తీశాడు. అంది బంప‌ర్ హిట్. దేశ స్థాయిలో అవార్డు కూడా ద‌క్కింది.

ఇది ప‌క్క‌న పెడితే నాగ్ అశ్విన్ చేసిన ప్ర‌య‌త్నం తెర మీద ఫ‌లించేలా చేసింది. ఒక ర‌కంగా విజువ‌ల్ వండ‌ర్ అంటూ రివ్యూస్ వ‌స్తున్నాయి. ప్ర‌ధానంగా బిగ్ బి అమితాబ్ బ‌చ్చ‌న్, కోలీవుడ్ న‌టుడు క‌మ‌ల్ హాస‌న్ న‌టించిన ఈ చిత్రం ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ‌గా నిలిచింది.

క‌ల్కి చిత్రం పాజిటివ్ టాక్ తెచ్చుకోవ‌డంతో సంతోషం వ్య‌క్తం చేశారు ఏపీ ఐటీ, క‌మ్యూనికకేష‌న్స్ శాఖ మంత్రి నారా లోకేష్ అభినంద‌న‌ల‌తో ముంచెత్తారు. ప్ర‌ధానంగా సినిమా తీసిన ద‌ర్శ‌కుడు నాగ్ అశ్విన్ , నిర్మాత అశ్వ‌నీ ద‌త్ కు కంగ్రాట్స్ తెలిపారు.