మరిన్ని విజయాలు సాధించాలన్న లోకేష్
అమరావతి – మంత్రి నారా లోకేష్ రాపిడ్ చెస్ ఛాంపియన్ షిప్ టైటిల్ గెలిచిన కోనేరు హంపిని ప్రశంసలతో ముంచెత్తారు. అసాధారణమైన పట్టుదల, సంకల్పం, నైపుణ్యం హంపి స్వంతమన్నారు. తెలుగు వారందరికీ గర్వ కారణంగా నిలిచారని పేర్కొన్నారు. మరిన్ని విజయాలు సాధించి భావితరాలకు స్పూర్తి దాయకంగా నిలవాలని కోరారు లోకేష్. హంపి నిజమైన భారతీయ చెస్ దిగ్గజమన్నారు.
తాజాగా న్యూయార్క్ లో జరిగిన ఫైనల్ పోరులో ఇండోనేషియాకు చెందిన ఐరీన్ సుకందర్ ని ఓడించి విజేతగా నిలిచింది కోనేరు హంపి. 2019లో జార్జియాలో జరిగిన ఈవెంట్ లో కూడా సత్తా చాటారు. 37 ఏళ్ల వయసు కలిగిన ఆమె 11 పాయింట్లు సాధించి విజేతగా నిలిచింది.
ఇదిలా ఉండగా పురుషుల విభాగంలో రష్యాకు చెందిన 18 ఏళ్ల వోలోడర్ ముర్జిన్ టైటిల్ గెలుపొందాడు. ముర్జిన్ 17 సంవత్సరాల వయస్సులో టైటిల్‌ను సాధించిన నోడిర్బెక్ అబ్దుసట్టోరోవ్ తర్వాత ఫైడ్ ప్రపంచ ర్యాపిడ్ ఛాంపియన్‌గా రెండవ యువకుడు కావడం విశేషం.