నితీష్ రెడ్డికి లోకేష్ కంగ్రాట్స్
ఏపీకి మరింత పేరు తీసుకు రావాలి
అమరావతి – ఏపీ ఐటీ, కమ్యూనికేషన్స్ శాఖ మంత్రి నారా లోకేష్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మంగళవారం ట్విట్టర్ వేదికగా ఆయన ఏపీకి చెందిన క్రికెటర్ నితీశ్ కుమార్ రెడ్డిని ప్రత్యేకంగా అభినందనలతో ముంచెత్తారు. ఇవాళ బీసీసీఐ భారత జట్టును ప్రకటించింది. ఇందులో 15 మంది సభ్యులతో కూడిన టీమ్ ను ఖరారు చేశారు టీమిండియా సెలెక్షన్ కమిటీ చైర్మన్ అజిత్ అగార్కర్.
భారత జట్టు జింబాబ్వే జట్టుతో 5 మ్యాచ్ ల టి20 సీరీస్ ఆడనుంది. ఈ జట్టుకు శుభ్ మన్ గిల్ నాయకత్వం వహించనున్నాడు. టీమ్ లోకి ఊహించని రీతిలో ఐపీఎల్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు తరపున ప్రాతినిధ్యం వహించిన నితీశ్ కుమార్ రెడ్డి అద్భుతమైన ప్రతిభతో ఆకట్టుకున్నాడు. అంతే కాదు ఎమర్జింగ్ ప్లేయర్ అవార్డు కూడా స్వంతం చేసుకున్నాడు.
ఇతడి స్వస్థలం ఏపీలోని విశాఖ. ఎంపికైన సందర్బంగా ఏపీ మంత్రి నారా లోకేష్ కంగ్రాట్స్ తెలిపాడు. మరోసారి సత్తా చాటి ఏపీకి మంచి పేరు తీసుకు రావాలని కోరారు.