త్యాగానికి..ధర్మానికి ప్రతీక బక్రీద్
ముస్లింలకు నారా లోకేష్ గ్రీటింగ్స్
అమరావతి – బక్రీద్ పర్వదినం సందర్బంగా ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ శుభాకాంక్షలు తెలిపారు. సోమవారం ట్విట్టర్ వేదికగా ఆయన స్పందించారు. రాష్ట్రంలోని ముస్లిం సోదర సోదరీమణులందరికీ మంచి జరగాలని కోరారు.
సమాజంలో త్యాగ నిరతిని పెంపొందించే బక్రీద్ పండుగ సందర్భంగా ప్రతి ఒక్కరికీ పేరు పేరునా గ్రీటింగ్స్ తెలిపారు నారా లోకేష్. ఇస్లాంలో త్యాగం, దాన గుణాలకు ప్రత్యేకమైన స్థానముందని స్పష్టం చేశారు.
ప్రవక్త ఇబ్రహీం మహోన్నత త్యాగాన్ని స్మరించుకుంటూ జరుపుకునే పండుగ ఈద్ అల్ అదా (బక్రీద్) అని, ఇది మనుషులందరిలో సమాన భావన పెంపొందించేలా చేస్తుందని తెలిపారు ఏపీ ఐటీ శాఖ మంత్రి. తమ ప్రభుత్వం బక్రీద్ సందర్బంగా సకల ఏర్పాట్లు చేసిందని వెల్లడించారు.