విజయ దశమి శుభాకాంక్షలు – నారా లోకేష్
ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలి
అమరావతి – విజయ దశమి పండుగ సందర్బంగా తెలుగు వారందరికీ శుభాకాంక్షలు తెలిపారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైద్య, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి నారా లోకేష్. దసరాను పురస్కరించుకుని దేశ, విదేశాల్లోని తెలుగు ప్రజలంతా బాగుండాలని కోరారు.
ప్రజలంతా సుఖ శాంతులతో వర్థిల్లేలా చూడాలని ఆ కనక దుర్గమ్మ తల్లిని వేడుకుంటున్నానని పేర్కొన్నారు. చెడు పై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా నిర్వహించుకునే దసరా పండుగ మన జీవితాల్లో కొత్త వెలుగు నింపాలని ఆకాంక్షిస్తున్నాని తెలిపారు నారా లోకేష్.
దుష్ట సంహారం తర్వాత శాంతి, సౌభ్రాతృత్వంతో అందరూ కలిసి మెలిసి జీవించాలన్నదే దసరా పండుగ సందేశమన్నారు. ఇదే స్ఫూర్తితో శాంతియుత, అభివృద్ధికారక సమాజం కోసం కృషి చేద్దామని మంత్రి పిలుపునిచ్చారు.
శక్తి ఆరాధనకు ప్రాధాన్యతనిచ్చే ఈ పండుగ దినాల్లో అమ్మ వారి దివ్య మంగళ రూపాన్ని తొమ్మిది అవతారాల్లో దర్శించుకున్నామని తెలిపారు నారా లోకేష్. మరో వైపు ఆ దేవదేవుడైన తిరుమల శ్రీ వేంకటేశ్వరుడి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుపుకున్నామని అన్నారు.
ఇదే ఒరవడితో సర్వజన సంక్షేమాన్ని కొనసాగిద్దామని సూచించారు.