NEWSANDHRA PRADESH

ఆక‌లి తీరుస్తున్న అన్న క్యాంటీన్లు

Share it with your family & friends

అన్ని దానాల కంటే అన్న‌దానం గొప్ప‌ది

మంగ‌ళ‌గిరి – ఏపీ విద్యా, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ శుక్ర‌వారం అన్న క్యాంటీన్ ను సంద‌ర్శించారు. అక్క‌డ వ‌డ్డిస్తున్న టిఫిన్ , భోజ‌నాన్ని ప‌రిశీలించారు. మంగ‌ళ‌గిరిలో ఇవాల అన్న క్యాంటీన్ ను ప్రారంభించారు. తాను కూడా అక్క‌డికి వ‌చ్చిన వారితో క‌లిసి తిన్నారు. ఈ సంద‌ర్బంగా కీల‌క వ్యాఖ్య‌లు చేశారు నారా లోకేష్.

త‌న తాతయ్య దివంగ‌త సీఎం నంద‌మూరి తారాక రామారావు పేరు మీద అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా అన్న క్యాంటీన్ల‌ను ప్రారంభించడం జ‌రిగింద‌ని చెప్పారు. గ‌త జ‌గన్ మోహ‌న్ రెడ్డి ప్ర‌భుత్వం కావాల‌ని పేద‌ల ఆక‌లి తీర్చ‌కుండా అన్న క్యాంటీన్ల‌ను దురుద్దేశ పూర్వ‌కంగా మూసి వేసింద‌న్నారు.

కానీ తమ కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన వెంట‌నే పాత వాటిని పునరుద్ద‌రించ‌డంతో పాటు కొత్త‌గా 100 అన్న క్యాంటీన్ల‌కు శ్రీ‌కారం చుట్టామ‌ని చెప్పారు నారా లోకేష్. అన్న క్యాంటీన్ల కార‌ణంగా పేద‌లు, సామాన్యులు ఆక‌లితో అల‌మటించే వారికి ఆస‌రాగా ల‌భించేలా చేశామ‌న్నారు.

ప్రజా ప్రభుత్వంలో అన్న క్యాంటీన్లను తిరిగి ప్రారంభించడం ఎంతో ఆత్మ సంతృప్తిని ఇచ్చిందన్నారు.
మంగళగిరి నియోజకవర్గం తాడేపల్లిలోని నులకపేట, మంగళగిరి పట్టణంలోని పాత బస్టాండ్ వద్ద ఉన్న అన్న క్యాంటీన్లను ప్రారంభించారు నారా లోకేష్.