మంత్రి నారా లోకేష్ కీలక ప్రకటన
అమరావతి – మంత్రి నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. అటవీ భూములు, టైగర్ జోన్ నిబంధనల కారణంగా కడప జిల్లా బద్వేలు నియోజకవర్గం నల్లమలలోని కాశీనాయన ఆశ్రమం అన్నదాన సత్రాన్నికూల్చివేయడం బాధాకరమన్నారు. అటవీ నిబంధనలు ఉన్నా, భక్తుల మనోభావాలు గౌరవించి, అన్నదాన కార్యక్రమాలు జరిగే భవనాలను కూల్చకుండా ఉండాల్సిందన్నారు. ఈ కూల్చివేతలకు ప్రభుత్వం తరఫున తాను క్షమాపణ చెబుతున్నానని అన్నారు. అధికారులపై చర్యలు తీసుకుంటామన్నారు. గా నా సొంత నిధులతో అదే చోట అన్నదాన సత్రం పునర్నిర్మిస్తానని ప్రకటించారు.
ఇదిలా ఉండగా ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా కాశీనాయన సత్రాన్ని కూల్చి వేయడం పట్ల పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమైంది. రాయలసీమతో పాటు ఏపీలో చాలా చోట్ల కాశీనాయన ట్రస్టు ఆధ్వర్యంలో నిరంతరం వేలాది మంది అన్నార్థులకు ఆకలిని తీరుస్తున్నాయి. పేదల ఆకలిని దూరం చేయడం ఎంత వరకు సబబు అని ప్రశ్నిస్తున్నారు భక్తులు. ఎలాంటి స్వార్థం లేకుండా కేవలం సామాజిక సేవా దృక్ఫథంతో ఏర్పాటు చేసిన కాశీనాయన అన్నదాన సత్రం భవనాలను కూల్చి వేయడం బాధాకరమన్నారు.