NEWSANDHRA PRADESH

మంగ‌ళ‌గిరిని నెంబ‌ర్ వ‌న్ చేస్తా

Share it with your family & friends

టీడీపీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి లోకేష్

మంగ‌ళ‌గిరి – తెలుగుదేశం పార్టీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేష్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. దేశంలోనే మంగ‌ళ‌గిరి నియోజ‌క‌వ‌ర్గాన్ని నెంబ‌ర్ వ‌న్ గా మారుస్తాన‌ని చెప్పారు. నియోజ‌క‌వ‌ర్గంలోని కృష్ణాయపాలెం గ్రామంలో శుక్ర‌వారం నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంలో పాల్గొన్నారు నారా లోకేష్‌.

అమరావతి లో రాజధాని ఏర్పాటు కి అసెంబ్లీ సాక్షిగా మద్దతు ఇచ్చిన జగన్ ఆ తరువాత మాట మార్చి మడమ తిప్పి చేసిన విధ్వంసం గురించి ప్రజలకు వివరించారు. రాజధాని నిర్మాణం ఆగి పోవడంతో గ్రామాల్లో నెలకొన్న అనేక సమస్యల గురించి ప్రజలు త‌న‌ దృష్టికి తీసుకు వ‌చ్చార‌ని చెప్పారు నారా లోకేష్‌.

25 ఏళ్లు మంగళగిరిని పాలించిన మురుగుడు హనుమంతు రావు, ఆళ్ల రామకృష్ణారెడ్డి కుటుంబాలు నియోజకవర్గానికి చేసింది ఏమీ లేద‌న్నారు. ప్రజా ప్రభుత్వం ఏర్పడిన వెంటనే గ్రామాల్లో మౌలిక వసతులు కల్పిస్తామ‌న్నారు నారా లోకేష్, రాజధాని పనులు ప్రారంభించి అందరికీ ఉపాధి అవకాశాలు కల్పిస్తామ‌ని చెప్పారు. రాజధాని పోరాటంలో పెట్టిన కేసులు అన్నీ ఎత్తివేస్తామని హామీ ఇచ్చారు.