జగన్ జైలుకు వెళ్లడం ఖాయం
నారా లోకేష్ షాకింగ్ కామెంట్స్
అమరావతి – ఏపీలో రాజకీయం వేడెక్కింది. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నిప్పులు చెరిగారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆదివారం శంఖారావంలో భాగంగా ప్రసంగించారు. పదే పదే సిద్దం అంటున్నాడని, దేని కోసం సిద్దమో ప్రజలకు చెప్పాలన్నారు.
అన్నింటికంటే తాము పవర్ లోకి వస్తున్నామని, జగన్ మోహన్ రెడ్డి జైలుకు వెళ్లడం ఖాయమన్నారు నారా లోకేష్. వైసీపీ పాలనలో దళితులు, బీసీలపై ఎక్కువగా దాడులు జరిగాయని, వారంతా తీవ్ర భయాందోళనలో ఉన్నారని ఆవేదన చెందారు.
టీడీపీ, జనసేన కూటమి అధికారంలోకి వచ్చాక ప్రతి ఒక్కరి అవినీతి బండారాన్ని బయట పెడ్తామని హెచ్చరించారు నారా లోకేష్. ఏపీని సర్వ నాశనం చేసిన ఘనత జగన్ రెడ్డికే దక్కుతుందన్నారు. ఆయన పాలనలో యువత, అన్ని వర్గాల ప్రజలు , మహిళలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు.
టీడీపీ, జనసేన సర్కార్ పూర్తిగా ప్రజా పాలన సాగిస్తుందన్నారు. పేదలకు మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా పంపిణీ చేస్తామని హామీ ఇచ్చారు నారా లోకేష్.