BUSINESSTECHNOLOGY

అడోబ్ ఆర్ అండ్ బి కేంద్రాన్ని ఏర్పాటు చేయండి

Share it with your family & friends

అడోబ్ సీఈవోతో ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్

అమెరికా – అమెరికా టూర్ లో బిజీగా ఉన్నారు ఏపీ ఐటీ, క‌మ్యూనికేష‌న్స్ శాఖ మంత్రి నారా లోకేష్. ఈ సంద‌ర్బంగా ఆయ‌న ప్ర‌ముఖ కంపెనీ అడోబ్ ను సంద‌ర్శించారు. ఈ సంద‌ర్బంగా ఏపీలో అడోబ్ ఆర్ అండ్ బి కేంద్రాన్ని ఏర్పాటు చేయాల‌ని కోరారు నారా లోకేష్. స్మార్ట్ గవర్నెన్స్, ఎఐ-డ్రైవెన్ సొల్యూషన్స్‌లో భాగస్వామ్యం వహించాల‌ని, యువతలో డిజిటల్ నైపుణ్యాల మెరుగుదలకు సహకారం అందించాల‌ని విన్న‌వించారు.

తాజాగా శాన్ ఫ్రాన్సిస్కోలో అడోబ్ సిఇఓ శంతను నారాయణ్ తో భేటీ అయిన లోకేష్… ఏపీలో పెట్టుబడులు పెట్టాల్సిందిగా కోరారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నేతృత్వంలోని ప్రగతిశీల ప్రభుత్వం ఇన్వెస్టర్స్ ఫ్రెండ్లీ విధానాలతో ముందుకు సాగుతోంద‌న్నారు. ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు పెట్టుబడులకు అన్నివిధాల అనుకూలమైన ప్రాంతమని చెప్పారు.

ఇన్నోవేషన్ అండ్ గ్రోత్ విజన్ తో మీరు చేస్తున్న కృషి ఆంధ్రప్రదేశ్ డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్ విజన్‌తో సరిపోతుందన్నారు. డిజిటల్ ఫ్లాట్ ఫాంల ద్వారా సృజనాత్మక, వ్యాపార సాధనాల్లో అడోబ్ సేవలు ప్రశంసనీయమ‌ని కొనియాడారు.

ఏపిలో ఇ-గవర్నెన్స్‌ని సమగ్ర పర్చడం, గ్లోబల్ టెక్ హబ్‌గా మార్చడానికి మీవంతు సహకారం అందించాల‌ని కోరారు. ఎఐ వినియోగం ద్వారా ప్రజలకు వేగవంతమైన, మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తున్నామ‌న్నారు.

డిజిటల్ విద్యా ప్లాట్‌ఫారమ్‌లలో ఏఐ ఆధారిత పరిష్కారాలను ఏకీకృతం చేయడంలో మీ భాగస్వామ్యాన్ని కోరుతున్నామని తెలిపారు. ఏపిలో అడోబ్ ఆర్ అండ్ డి కేంద్రాన్ని ఏర్పాటు చేయాల‌ని, ఆంధ్రప్రదేశ్ లో యువతను డిజిటల్ నైపుణ్యాలతో శక్తివంతం చేయాలనే కృత నిశ్చయంతో ఉన్నామ‌న్నారు.

డిజిటల్ ఎడ్యుకేషన్ ను మెరుగు పర్చడంలో భాగంగా డిజిటల్ ఎడ్యుకేషన్ ప్లాట్‌ఫారమ్‌లను రాష్ట్రానికి తీసుకురావడానికి అడోబ్ తరపున సహకారం అందించాల‌న్నారు. డాక్యుమెంట్ ప్రొడక్టివిటీ, ఎఐ పవర్డ్ టూల్స్‌లో అడోబ్ నైపుణ్యం త‌మ‌కు ఎంతగానో ఉపకరిస్తుందని స్ప‌ష్టం చేశారు నారా లోకేష్.

డాక్యుమెంట్ మేనేజ్‌మెంట్ సిస్టమ్స్, పబ్లిక్ సర్వీస్‌లను క్రమబద్ధీకరించడం, ప్రభుత్వ ప్రక్రియలను మరింత సమర్థవంతంగా నిర్వహించడానికి, స్మార్ట్ గవర్నెన్స్, ఎఐ-డ్రైవెన్ సొల్యూషన్స్‌ అమలులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో కలసి పని చేయాల‌ని కోరారు.

ప్రభుత్వం, పరిశ్రమల వినియోగానికి సంబంధించి క్లౌడ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి, ప్రభుత్వ కార్యకలాపాలు, పౌరసేవల్లో క్లౌడ్ ఇంటిగ్రేషన్‌ కు అడోబ్ భాగస్వామ్యం వహించే అంశాన్ని పరిశీలించాల‌ని సూచించారు.