BUSINESSTECHNOLOGY

యాపిల్ వైఎస్ ప్రెసిడెంట్ తో లోకేష్ భేటీ

Share it with your family & friends

ఏపీలో కంపెనీని విస్త‌రించాల‌ని విన్న‌పం

అమెరికా – అమెరికా ప‌ర్య‌ట‌న‌లో బిజీగా ఉన్నారు ఏపీ విద్యా, ఐటీ, క‌మ్యూనికేష‌న్స్ శాఖ మంత్రి నారా లోకేష్. ఆయ‌న ప‌లు కంపెనీల‌కు చెందిన చైర్మ‌న్లు, మేనేజింగ్ డైరెక్ట‌ర్లు, సీఈవోల‌తో భేటీ అవుతున్నారు. ఇప్ప‌టికే ఆయ‌న మైక్రోసాఫ్ట్ సీఈవో స‌త్య నాదెళ్ల‌ను క‌లుసుకున్నారు. అంత‌కు ముందు టెస్లా కంపెనీని సంద‌ర్శించారు. ఏపీ అత్యంత అనువైన స్థ‌ల‌మ‌ని పేర్కొన్నారు. పెట్టుబ‌డులు పెట్టాల‌ని కోరారు.

మంగ‌ళ‌వారం శాన్ ఫ్రాన్సిస్కోలోని దిగ్గ‌జ యాపిల్ సంస్థ కేంద్ర కార్యాలయాన్ని సందర్శించారు నారా లోకేష్. ఆ సంస్థ వైస్ ప్రెసిడెంట్ (ఆపరేషన్స్) ప్రియా బాలసుబ్రహ్మణ్యంని కలిశారు. భారతదేశంలో యాపిల్ కార్యకలాపాల విస్తరణకు ఆంధ్రప్రదేశ్ రావాలని ఆహ్వానించారు.

సంస్థ కోరుకున్న చోట తయారీ యూనిట్ స్థాపనకు అవసరమైన అన్ని సదుపాయాలు కల్పించడానికి తాము సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ లో అత్యంత నైపుణ్యం కలిగిన మానవ వనరులు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఎపి ప్రభుత్వంతో కలిసి పనిచేసే అంశాన్ని పరిశీలిస్తామని ప్రియా సుబ్రహ్మణ్యం సానుకూలంగా స్పందించార‌ని ఈ సంద‌ర్బంగా నారా లోకేష్ వెల్ల‌డించారు.