సిఈవో జెన్సన్ హువాంగ్ తో లోకేష్ భేటీ
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పై చర్చ
ముంబై – ఏపీ ఐటీ, విద్యా, కమ్యూనికేషన్స్ శాఖ మంత్రి నారా లోకేష్ గురువారం ఎన్వీడియా ఫౌండర్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ జెన్సన్ హువాంగ్ తో భేటీ అయ్యారు. ఈ సందర్బంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి విస్తృతంగా చర్చించారు.
హువాంగ్ ను కలవడం ఆనందంగా ఉందన్నారు. ఈ సందర్బంగా ఏఐ, ఎంఐ , సైబర్ సెక్యూరిటీ, హెల్త్ , లాజిస్టిక్ , తదితర రంగాలపై ఏఐని ఎలా ఉపయోగించాలనే దానిపై చర్చించామని తెలిపారు నారా లోకేష్.
ఏఐ పట్ల అద్భుతమైన అవగాహన కలిగి ఉన్న జెన్సన్ తో భేటీ కావడం తనకు ఎనలేని సంతోషం కలిగించిందన్నారు. ప్రస్తుతం ముంబైలో ఎన్వీడియా ఏఐ ఆధ్వర్యంలో నిర్వహించిన సమ్మిట్ లో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు నారా లోకేష్.
ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యంత విలువైన సంస్థగా గుర్తింపు పొందింది. ఏఐ కంప్యూటింగ్‌లో ప్రపంచానికి అగ్రగామిగా ఉందన్నారు. భవిష్యత్తులో ఏఐ ఏమి చేయగలదో, అది పాలనను మరింత సమర్థవంతంగా ఎలా చేయగలదో తాము మాట్లాడటం జరిగిందన్నారు.
అమరావతిలో రాబోయే ఏఐ విశ్వ విద్యాలయం ఏర్పాటులో జాన్సన్ హువాంగ్ మార్గదర్శకత్వం చేయాల్సిందిగా, మద్దతును కోరామని చెప్పారు నారా లోకేష్. అంతర్దృష్టితో కూడిన చర్చకు తాను కృతజ్ఞతలు తెలియ చేస్తున్నట్లు పేర్కొన్నారు.
త్వరలో మరోసారి జాన్సన్ హువాంగ్ తో భేటీ కావాలని నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు నారా లోకేష్.