డేటా సిటీ ఏర్పాటుపై విస్తృత చర్చలు
న్యూఢిల్లీ – గూగుల్ క్లౌడ్ ఎండీ బిక్రమ్ సింగ్, కంట్రీ డైరెక్టర్ (పబ్లిక్ సెక్టార్ అండ్ ఎడ్ టెక్) ఆశిష్ తో మంత్రి నారా లోకేష్ కలుసుకున్నారు. ఈ సందర్భంగా విశాఖపట్నంలో గూగుల్ క్లౌడ్ ఏర్పాటు చేయబోయే డేటా సిటికి సంబంధించి చర్చించారు. ప్రభుత్వం తరపున ఇవ్వాల్సిన అనుమతులు, భూ కేటాయింపులు, పాలసీని త్వరితగతిన ఇస్తామని, ఇందుకోసం ఎపి ఎకనమిక్ డెవలప్ మెంట్ బోర్డు చురుగ్గా పనిచేస్తోందని చెప్పారు.
డేటా సిటీ ఏర్పాటును కంపెనీ తరపున వేగవంతం చేయాలని కోరారు నారా లోకేష్. దీనివల్ల విశాఖ ఐటి ముఖచిత్రం మారుతుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. ఎఐలో ప్రపంచ స్థాయి అప్లికేషన్‌లను రూపొందించడానికి, స్టార్టప్ పర్యావరణ వ్యవస్థ ఏర్పాటుకు గూగుల్ డాటా సిటీ గేమ్ ఛేంజర్ కానుందని చెప్పారు నారా లోకేష్.
డిజిటల్ ట్రాన్సఫర్మేషన్ కు ఎపి ప్రభుత్వం చేస్తున్న కృషిని గూగుల్ క్లౌడ్ ఎండీ బిక్రమ్ సింగ్ ఈ సందర్భంగా కొనియాడారు. డాటా సిటీ పనుల వేగవంతానికి అవసరమైన అన్ని చర్యలు చేపడతామని చెప్పారు.