BUSINESSTECHNOLOGY

మైక్రోసాఫ్ట్ సీఈవో స‌త్య నాదెళ్ల‌తో లోకేష్ భేటీ

Share it with your family & friends

కీల‌క‌మైన అంశాల‌పై ఇరువురు చ‌ర్చ‌లు

అమెరికా – యుఎస్ టూర్ లో ఉన్న ఏపీ విద్యా, ఐటీ, క‌మ్యూనికేష‌న్ల శాఖ మంత్రి నారా లోకేష్ బిజీగా ఉన్నారు. ప్ర‌పంచ ఐటీ దిగ్గ‌జ కంపెనీని సంద‌ర్శించారు. ఈ సంద‌ర్బంగా ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోని అనంత‌పురం జిల్లాకు చెందిన మైక్రోసాఫ్ట్ సీఈవో స‌త్య నాదెళ్ల‌తో భేటీ అయ్యారు.

ఆంధ్రప్రదేశ్‌లో ఐటీ, ఏఐ నైపుణ్యాభివృద్ధిని అభివృద్ధి చేయడంలో విలువైన మార్గదర్శకత్వం తో పాటు మ‌ద్ద‌తు ఇవ్వాల‌ని కోర‌డం జ‌రిగింద‌ని తెలిపారు నారా లోకేష్.

రాష్ట్రంలో డిజిటల్ పరివర్తన, అవకాశాలను నడపడానికి సహకార ప్రయత్నాల కోసం ఎదురు చూస్తున్నట్లు పేర్కొన్నారు. అంత‌కు ముందు నారా లోకేష్ ఆస్టిన్ లోని టెస్లా కేంద్ర కార్యాలయాన్నిసంద‌ర్శించారు.

అంతర్జాతీయంగా ఎలక్ట్రిక్ వాహనాల తయారీ రంగంలో ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు పెట్టడానికి గల అవకాశాలు, అనుకూల‌త‌ల‌ను టెస్లా సిఎఫ్ఓ వైభవ్ తనేజాకు వివ‌రించారు.

విజనరీ లీడర్ చంద్రబాబు నేతృత్వాన 2029 నాటికి ఎపిలో 72 గిగావాట్ల రెన్యువబుల్ ఎనర్జీ ఉత్పత్తి సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నామ‌ని, త‌మ‌ లక్ష్య సాధనకు టెస్లా వంటి అగ్రశ్రేణి గ్లోబల్ కంపెనీల సహాయ, సహకారాలు అందించాల‌ని కోరారు. ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లా టెస్లా ఈవీ తయారీ, బ్యాటరీ ఉత్పత్తుల యూనిట్ల ఏర్పాటుకు వ్యూహాత్మక ప్రదేశంగా ఉంటుంద‌ని తెలిపారు.