Saturday, April 19, 2025
HomeNEWSANDHRA PRADESHసీఈవో ఇంద్రా నూయితో లోకేష్ భేటీ

సీఈవో ఇంద్రా నూయితో లోకేష్ భేటీ

పెట్టుబ‌డుల‌కు ఆంధ్ర‌ప్ర‌దేశ్ స్వ‌ర్గ‌ధామం

అమరావ‌తి – ప్ర‌పంచ దిగ్గ‌జ కంపెనీ పెప్సికో మాజీ చైర్మ‌న్, సీఈవో ఇంద్రా నూయీతో ఏపీ ఐటీ, క‌మ్యూనికేష‌న్స్ శాఖ మంత్రి నారా లోకేష్ భేటీ అయ్యారు. అమెరికా ప‌ర్య‌ట‌న‌లో భాగంగా లాస్ వెగాస్‌లో నిర్వహిస్తున్న ఐటి సర్వ్ సినర్జీ సమ్మిట్ ప్రాంగణంలో స‌మావేశం కావ‌డం ప్రాధాన్య‌త సంత‌రించుకుంది.

ఇదిలా ఉండ‌గా విజనరీ లీడర్ నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో ఇన్వెస్టర్స్ ఫ్రెండ్లీ విధానాలు అమలుచేస్తూ వేగవంతమైన అభివృద్ధి దిశగా ఆంధ్రప్రదేశ్ ముందుకు సాగుతోందని వివరించారు నారా లోకేష్.

టెక్నాలజీ, తయారీ రంగంలో విదేశీ పెట్టుబడులను ఆకర్షించడానికి ఏపి ప్రభుత్వం చేపడుతున్న నిర్మాణాత్మక కృషిలో పెప్సికో భాగస్వాములు అవ్వాలని కోరారు. మహిళా నాయకత్వాన్ని ప్రోత్సహించడంలో ఏపీ ప్రభుత్వానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

ఈ సంద‌ర్బంగా పెప్సికో మాజీ చైర్మన్, సీవో ఇంద్రా నూయీ సానుకూలంగా స్పందించారు. ఏపీలో పెట్టుబ‌డులు పెట్టేందుకు గాను సాధ్యా సాధ్యాల గురించి ఆలోచిస్తామ‌ని, త్వ‌ర‌లోనే త‌మ నిర్ణ‌యాన్ని ప్ర‌క‌టిస్తామ‌ని స్పష్టం చేశారు. కాగా సానుకూలంగా స్పందించినందుకు ఇంద్రా నూయీకి ధ‌న్య‌వాదాలు తెలిపారు నారా లోకేష్‌.

RELATED ARTICLES

Most Popular

Recent Comments