NEWSANDHRA PRADESH

రెవేచ‌ర్ సీఈవోతో లోకేష్ భేటీ

Share it with your family & friends

టెక్ టాలెంట్ డెవ‌ల‌ప్ మెంట్ సెంట‌ర్

అమెరికా – ఏపీ ఐటీ, క‌మ్యూనికేష‌న్స్ శాఖ మంత్రి నారా లోకేష్ అమెరికాలో బిజీగా ఉన్నారు. ఆయ‌న కీల‌క‌మైన సంస్థ‌ల ప్ర‌తినిధులు, చైర్మ‌న్లు, సీఈవోలు, మేనేజింగ్ డైరెక్ట‌ర్లతో భేటీ అవుతూ వ‌స్తున్నారు. ఇప్ప‌టికే మైక్రోసాఫ్ట్ సీఈవో స‌త్య నాదెళ్ల‌, అడోబ్ సీఈవో శంత‌ను నారాయ‌ణ్ తో పాటు పెప్సికో మాజీ చైర్మ‌న్ ఇంద్రా నూయీతో భేటీ అయ్యారు.

తాజాగా ఐటి సర్వ్ సినర్జీ సమ్మిట్ సందర్భంగా రెవేచర్ సిఇఓ అశ్విన్ భరత్‌తో సమావేశమయ్యారు నారా లోకేష్. ఆంధ్రప్రదేశ్‌లో టెక్ టాలెంట్ డెవలప్‌మెంట్ సెంటర్‌ను నెలకొల్పడానికి రెవేచర్‌ భాగస్వామ్యం వహించాలని కోరారు.

రాష్ట్రంలో నైపుణ్య కార్యక్రమాలకు అనుగుణంగా సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్, ఇతర డిమాండ్ ఉన్న ఐటి నైపుణ్యాలలో యువతకు శిక్షణ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్ కార్యక్రమాలకు మద్దతు ఇవ్వాలని కోరారు.

ఈ సంద‌ర్బంగా రేవేచ‌ర్ సీఈవో అశ్విన్ భ‌ర‌త్ నారా లోకేష్ చేసిన విన్న‌పానికి స్పందించారు. ఈ మేర‌కు ఏపీలో సెంట‌ర్ నెలకొల్పే విష‌యంపై ఆలోచిస్తామ‌ని స్ప‌ష్టం చేశారు. సీఈవోకు ధ‌న్య‌వాదాలు తెలిపారు నారా లోకేష్‌.