సేల్స్ ఫోర్స్ ప్రెసిడెంట్ తో లోకేష్ భేటీ
ఏపీలో పెట్టుబడి అవకాశాల గురించి చర్చ
అమెరికా – యుఎస్ టూర్ లో భాగంగా బిజీగా ఉన్నారు ఏపీ విద్యా, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్. గురువారం పలు కీలకమైన కంపెనీలతో, ప్రతినిధులతో సమావేశం అయ్యారు. ఈ సందర్బంగా సేల్స్ ఫోర్స్ ప్రెసిడెంట్ , చీఫ్ ఇంజనీరింగ్ ఆఫీసర్ శ్రీని తల్లాప్రగడతో చర్చించారు. ఎగ్జిక్యూటివ్ వైఎస్ ప్రెసిడెంట్ రమేష్ రాగినేనితో భేటీ అయ్యారు.
శాన్ ఫ్రాన్సిస్కోలో జరిగిన ఈ కీలక సమావేశంలో ఏపీ రాష్ట్రంలో పెట్టుబడి అవకాశాల గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఇ-గవర్నెన్స్, ప్రభుత్వ రంగ సేవలలో ఏఐ, క్లౌడ్ టెక్నాలజీల ఏకీకరణ గురించి చర్చించారు నారా లోకేష్.
రాష్ట్రవ్యాప్తంగా సీఆర్ఎం సొల్యూషన్స్, ఏఐ ఆధారిత పబ్లిక్ సర్వీసెస్ , స్మార్ట్ సిటీ కార్యక్రమాలలో వారి నైపుణ్యాన్ని అందించమని తాను సేల్స్‌ఫోర్స్‌ని ఆహ్వానించారు ఏపీ ఐటీ, కమ్యూనికేషన్స్ శాఖ మంత్రి. అదనంగా తాము వైజాగ్‌లో రీసెర్చ్ అండ్ డెవలప్ మెంట్ కేంద్రాన్ని స్థాపించేందుకు మొగ్గు చూపారు . ఈ సందర్భంగా సేల్స్ ఫోర్స్ ప్రెసిడెంట్, చీఫ్ ఇంజనీర్ శ్రీని తల్లాప్రగడతో పాటు రమేష్ రాగినేని ని ప్రత్యేకంగా అభినందనలతో ముంచెత్తారు నారా లోకేష్.