ఇండియా స్పోరా ఫోరమ్ లో నారా లోకేష్
ఏపీకి రండి భారీగా పెట్టుబడులు పెట్టండి
అమెరికా – ఏపీ ఐటీ, పరిశ్రమల, కమ్యూనికేషన్స్ శాఖ మంత్రి నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఆయన అమెరికా పర్యటనలో బిజీగా ఉన్నారు. శాన్ ఫ్రాన్సిస్కోలో ఇండియా స్పోరా ఫోరమ్ తో పాటు యుఎస్ఐబీసీ ప్రతినిధులతో భేటీ అయ్యారు. ఈ సందర్బంగా నారా లోకేష్ మాట్లాడారు.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దార్శనికతతో కూడిన నాయకత్వంలో ఏపీ స్టార్టప్ , మ్యానుఫ్యాక్సరింగ్ హబ్ గా ఎదిగేందుకు కీలకమైన ప్రాంతంగా ఉందన్నారు. వేగవంతమైన అనుమతులు, వికేంద్రీకృత పారిశ్రామిక కేంద్రాలు, ఐటీ, ఫార్మా, లాజిస్టిక్ , బయో ఇంధనం వంటి రంగాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు.
పెట్టుబడులు పెట్టే పెట్టుబడిదారులకు, కంపెనీలకు పెద్ద ఎత్తున సహాయ సహకారాలు అందజేస్తామని హామీ ఇచ్చారు. ఎవరు వచ్చినా ఎలాంటి ఇబ్బందులు అంటూ ఉండవని స్పష్టం చేశారు నారా లోకేష్.
సాధికార ఆర్థిక అభివృద్ది బోర్డుతో సహా పరిశ్రమ స్నేహ పూర్వక సంస్కరణలకు తాము కట్టుబడి ఉన్నామని పేర్కొన్నారు.
ఇదే సమయంలో తాము రాష్ట్రంలో నూతనంగా ఏఐ విశ్వ విద్యాలయాన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఇందుకు సహాయ సహకారాలు అందించాలని కోరారు నారా లోకేష్.