NEWSANDHRA PRADESH

పెరోట్ గ్రూప్ చైర్మ‌న్ తో లోకేష్ భేటీ

Share it with your family & friends

పెట్టుబ‌డిదారుల‌కు గ్రాండ్ వెల్ క‌మ్

అమెరికా – ఏపీ ప్ర‌భుత్వం ఎన్నారైల‌కు, పెట్టుబ‌డిదారుల‌కు సాద‌ర స్వాగ‌తం ప‌లుకుతున్నామ‌ని స్ప‌ష్టం చేశారు నారా లోకేష్‌. ఆయ‌న అమెరికా ప‌ర్య‌ట‌న‌లో ఉన్నారు. పెరోట్ గ్రూప్ అండ్ హిల్‌వుడ్ డెవలప్‌మెంట్ చైర్మన్ రాస్ పెరోట్ జూనియర్ తో రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ డల్లాస్ లో భేటీ అయ్యారు.

పెరోట్ జూనియర్ రియల్ ఎస్టేట్, టెక్నాలజీ, డాటా సెంటర్, ఎనర్జీ రంగాల్లో విభిన్న పోర్ట్‌ఫోలియోలను పర్యవేక్షిస్తున్నారు.

“ఇన్నోవేటివ్ రియల్ ఎస్టేట్ , పబ్లిక్-ప్రైవేట్ భాగస్వామ్య ప్రాజెక్టుల్లో మీ వినూత్న విధానాలు రాష్ట్ర ఆర్థిక వృద్ధి, స్థిరత్వానికి తోడ్పడతాయి. మీ దార్శనిక ప్రాజెక్టులైన అలయన్స్‌టెక్సాస్ వంటివి ఆంధ్రప్రదేశ్ మౌలిక సదుపాయాల వృద్ధి వ్యూహంతో బాగా సరిపోతాయి. అలయన్స్ టెక్సాస్ తరహాలో పారిశ్రామిక, లాజిస్టిక్ పార్కులను అభివృద్ధి చేయడానికి ఎపిలోని తీరప్రాంతంలో అనువైన వాతావరణం నెలకొని ఉంది. ఎపిలో మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల్లో భాగస్వామ్యం వహించే అంశాన్ని పరిశీలించండి. స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్‌లు, పెద్ద పట్టణాల అభివృద్ధిలో సహకారం అందించండి.” అని రాస్ పెరోట్‌ను మంత్రి కోరారు.

ఈ సంద‌ర్బంగా రాస్ పెరోట్ సానుకూలంగా స్పందించారు.