NEWSANDHRA PRADESH

ఏపీ అక‌డ‌మిక్ క్యాలెండ‌ర్ విడుద‌ల

Share it with your family & friends

రిలీజ్ చేసిన విద్యా శాఖ మంత్రి లోకేష్

అమ‌రావ‌తి – ఏపీ విద్యా, ఐటీ, క‌మ్యూనికేష‌న్స్ శాఖ మంత్రి నారా లోకేష్ త‌న ఛాంబ‌ర్ లో ఇవాళ ఏపీ పాఠ‌శాల విద్యా శాఖ‌కు సంబంధించిన 2024-25 అక‌డమిక్ క్యాలెండ‌ర్ ను విడుద‌ల చేశారు. అనంత‌రం ఉండ‌వ‌ల్లి లోని త‌న నివాసంలో పాఠ‌శాల విద్యా శాఖ ఉన్న‌తాధికారుల‌తో స‌మీక్ష చేప‌ట్టారు నారా లోకేష్‌.

ఈ సంద‌ర్బంగా ప‌లు సూచ‌న‌లు చేశారు. ఇదే స‌మ‌యంలో కీల‌క వ్యాఖ్య‌లు చేయ‌డం ప్రాధాన్య‌త సంత‌రించుకుంది. ప్ర‌భుత్వ బ‌డులు స‌ర‌స్వ‌తీ నిల‌యాలుగా ఉండేలా కృషి చేయాల‌ని సూచించారు మంత్రి.

ఇదే స‌మ‌యంలో ప్ర‌భుత్వ ఆధీనంలోని విద్యాల‌యాల‌కు రాజకీయాల‌కు అతీతంగా ఉండాలని స్ప‌ష్టం చేశారు నారా లోకేష్‌. స్కూల్ మేనేజ్ మెంట్ కమిటీల పదవీ కాలం జూలైతో పూర్తయినందున ఆగస్టులో కమిటీల ఎన్నికలు పూర్తి చేయాలని ఆదేశించారు.

పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం నాణ్యత, మౌలిక సదుపాయాల మెరుగుదల పర్యవేక్షణ బాధ్యతను పేరెంట్స్ కమిటీలకు అప్పగించాలని స్ప‌ష్టం చేశారా నారా లోకేష్. కస్తూరిబా గాంధీ బాలికా విద్యాలయాల్లో ఖాళీగా ఉన్న టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి విధి విధానాలు ఖరారు చేయాల్సిందిగా స్ప‌ష్టం చేశారు.