ప్రకటించిన మంత్రి నారా లోకేష్
అమరావతి – నూతన సంవత్సరం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు మంత్రి నారా లోకేష్. తమ ప్రజా ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధే లక్ష్యంగా పని చేస్తుందని ప్రకటించారు. ప్రతి ఒక్క కుటుంబంలో ఆనందం వెల్లి విరిసేలా ప్రయత్నం చేస్తామన్నారు. ఇచ్చిన గ్యారెంటీలను అమలు చేసి తీరుతామని అన్నారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా సరే ముందుకే వెళతామన్నారు.
ఇందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదన్నారు నారా లోకేష్ ఈ నూతన ఏడాది ప్రతి ఒక్కరి జీవితంలో సుఖ సంతోషాలు, ఆనందాన్ని తీసుకు రావాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. గడచిన ఏడాదిలో రాష్ట్ర ప్రజలు విధ్వంస, నియంతృత్వ పాలనను తరిమికొట్టి ప్రజాస్వామ్య పాలనను ని పేర్కొన్నారు నారా లోకేష్.
ఆంధ్రప్రదేశ్ ను అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నిలిపేందుకు కూటమి ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తోందన్నారు. అభివృద్ధి లక్ష్యంగా ముందుకు వెళుతున్నామని స్పష్టం చేశారు. ఎన్నో ఆశలు, ఆనందాలు, సంతోషాలను మోసుకువస్తున్న కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతున్నట్లు పేర్కొన్నారు నారా లోకేష్.