భయం అనేది ఆర్ఆర్ఆర్ బ్లడ్ లో లేదు
ఏపీ మంత్రి నారా లోకేష్ కామెంట్స్
అమరావతి – భయం అనేది ఆర్ఆర్ఆర్ బయోడేటాలో లేదన్నారు ఏపీ మంత్రి నారా లోకేష్. యువ శాసనసభ్యులకు రఘురామకృష్ణరాజు ఆదర్శం కావాలన్నారు. డిప్యూటీ స్పీకర్ గా ఎన్నికైన రఘురామకు అభినందనలు తెలిపారు నారా లోకేష్.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. చంద్రబాబునాయుడు ట్రిపుల్ ఆర్ సినిమా గురించి, మీ గురించి చెప్పారు. నాకు ఆర్ఆర్ఆర్ అంటే రియల్, రెస్పాన్సిబుల్, రెబలియస్. రియల్ అని ఎందుకు అన్నానంటే మీ మనసులో ఏముంటే అది చెబుతారంటూ కితాబు ఇచ్చారు. రఘురామ భోళా శంకరుడంటూ పేర్కొన్నారు.
తప్పు తప్పని చెబుతారు. కరెక్ట్ అయితే కరెక్ట్ అని చెబుతారు. గత ప్రభుత్వం చేసే తప్పుల్ని ముందే గ్రహించారు. కేంద్రంలో గత ప్రభుత్వంపై పోరాడి.. ఏపీ ఇప్పటికే అప్పుల్లో కూరుకు పోయిందని, ఇక అప్పులు ఇస్తే రాష్ట్రం ఇబ్బందులు పడుతుందని ఆనాడు పోరాడిన వ్యక్తి మీరు అని గుర్తు చేశారు.
ఉండి ఎమ్మెల్యే అయినప్పటి నుంచి నేను చూస్తున్నా.. సొంత నిధులు, సీఎస్ఆర్ నిధులు తీసుకువచ్చి పార్క్ లు అభివృద్ధి చేయడం, ప్రభుత్వ పాఠశాలలకు మరమ్మతులు చేయడం గర్వ కారణంగా ఉందన్నారు.
ఆనాడు వైసీపీ సర్కార్ చేసిన వేధింపులను తట్టుకుని నిలబడటం మామూలు విషయం కాదన్నారు నారా లోకేష్. తన తండ్రి చంద్రబాబుని అరెస్ట్ చేసినప్పుడు నాకు అండగా నిలబడ్డారని ప్రశంసించారు. ఢిల్లీలో న్యాయ పోరాటం చేస్తుంటే మీరు, గల్లా జయదేవ్, కనకమేడల రవీంద్ర అందరం కూర్చొని చర్చించే వాళ్లం అని తెలిపారు.