NEWSANDHRA PRADESH

కియా కంపెనీతో వేలాది మందికి ఉపాధి

Share it with your family & friends

ఏపీ ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్
అమ‌రావ‌తి – కియా కంపెనీతో వేలాది మందికి ఉపాధి క‌ల్పించ‌డం అద్భుతం అని పేర్కొన్నారు ఏపీ విద్యా, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్. శుక్ర‌వారం మంగ‌ళ‌గిరి నియోజ‌క‌వ‌ర్గం కొల‌నుకొండ‌లో ఏర్పాటు చేసిన సింహా మోటార్స్ కియా షో రూమ్ ను ప్రారంభించారు. ఈ సంద‌ర్బంగా ప్ర‌సంగించారు నారా లోకేష్‌.

ప్ర‌ముఖ పారిశ్రామిక‌వేత్త ర‌త‌న్ టాటా మ‌ర‌ణం ప‌ట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్య‌క్తం చేశారు. ఇదే స‌మ‌యంలో విజ‌న్ క‌లిగి ఉన్న నాయ‌కులు డిఫ‌రెంట్ గా ఉంటార‌ని అన్నారు. దూర‌దృష్టి క‌లిగిన నాయ‌కుడు ఉంటే భ‌విష్య‌త్తు త‌రాల‌కు మేలు జ‌రుగుతుంద‌న్నారు.

కరువు నేల పై కార్లు వ‌చ్చేలా చేసిన ఘ‌న‌త ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడుకు ద‌క్కుతుంద‌న్నారు నారా లోకేష్. ఒక్క కియా వల్ల‌ ఇప్పుడు రాష్ట్రంలో వేలాది మందికి ప్ర‌త్య‌క్షంగా ప‌రోక్షంగా ఉపాధి అవ‌కాశాలు ద‌క్కాయ‌ని అన్నారు.

జగన్ ఇతర రాష్ట్రాలకు తరిమేసిన కంపెనీలను తిరిగి తీసుకు రావడానికి ప్రత్యేక కార్యాచరణ పెట్టుకొని పని చేస్తున్నామ‌ని అన్నారు ఏపీ మంత్రి .