స్పష్టం చేసిన మంత్రి నారా లోకేష్
న్యూఢిల్లీ: కలిసికట్టుగా ఉండటం వల్లే విశాఖ స్టీల్ ను కాపాడు కోగలిగామన్నారు మంత్రి నారా లోకేష్. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో ఇక ముందు కూడా ఇదే పంథా కొనసాగిస్తామన్నారు. అధికారంలోకి వచ్చిన ఏడు నెలల్లోనే సమిష్టి కృషితో విశాఖ రైల్వే జోన్, అమరావతి, పోలవరం, స్టీల్ ప్లాంట్ కు నిధులు తెచ్చుకోగలిగామని అన్నారు. రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర మంత్రులు, ఎంపీలు చేస్తున్న కృషిని లోకేష్ అభినందించారు.
ఢిల్లీ పర్యటనలో బిజీగా ఉన్నారు. ఈ సందర్బంగా కేంద్ర మంత్రులను కలిశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు నారా లోకేష్. అతి తక్కువ కాలంలో విశాఖ స్టీల్ తో సహా అనేక సమస్యలు పరిష్కారం కావడం తనకు ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని అన్నారు.
ఢిల్లీలో కేంద్ర మంత్రులు శ్రీనివాస వర్మ, రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, టీడీపీ ఎంపీలు, బీజేపీ నేతలు మంత్రి లోకేష్ ను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఆరు నూరైనా సరే తాము ఇచ్చిన హామీలను నెర వేరుస్తామన్నారు. ఠంఛనుగా పెన్షన్లు 1వ తేదీ లోపే వేస్తున్నామన్నారు. కేంద్రం అందిస్తున్న సహకారానికి పీఎం మోడీకి, ఇతర మంత్రులకు ధన్యవాదాలు తెలిపారు.