సుప్రీం తీర్పు అభినందనీయం
ఏపీ మంత్రి నారా లోకేష్ ప్రశంస
అమరావతి – ఎస్సీ, ఎస్టీ వర్గీకరణ సబబే అంటూ సంచలన తీర్పు చెప్పింది భారత దేశ సర్వోన్నత న్యాయ స్థానం సుప్రీంకోరు. సీజేఐ జస్టిస్ ధనంజయ వై చంద్రచూడ్ ఆధ్వర్యంలోని ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. భారత రాజ్యాంగం మేరకు ప్రతి ఒక్కరికీ వారి వారి వర్గాల వారీగా అవకాశాలు ఉండాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది కోర్టు.
ఈ సందర్బంగా ఏపీ ఐటీ, విద్యా, కమ్యూనికేషన్స్ శాఖ మంత్రి నారా లోకేష్ సుప్రీంకోర్టు ఇచ్చిన సంచలన తీర్పును స్వాగతిస్తున్నట్లు తెలిపారు. గురువారం ట్విట్టర్ ఎక్స్ వేదికగా స్పందించారు. 20 ఏళ్ల కిందట సామాజిక న్యాయం సబబేనని తమ పార్టీ నాయకుడు, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు అమలు చేశారని గుర్తు చేశారు.
రాష్ట్రపతి ఆర్డినెన్సు ద్వారా వర్గీకరణ అమలు చేయడం వలన అనేక మందికి మాదిగలకు ఉద్యోగ అవకాశాలు వచ్చాయని తెలిపారు నారా లోకేష్. ఎన్నికల్లో ఇచ్చిన వర్గీకరణ హామీకి కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. అన్ని సామాజిక వర్గాల ఆర్థిక ,రాజకీయ అభివృద్ధి తెలుగుదేశం పార్టీ ఎజెండా అని పేర్కొన్నారు.