Sunday, April 20, 2025
HomeNEWSANDHRA PRADESHపున‌రావాస చ‌ర్య‌ల‌పై ఫోక‌స్ పెట్టాలి

పున‌రావాస చ‌ర్య‌ల‌పై ఫోక‌స్ పెట్టాలి

ఏపీ కేబినెట్ ను అప్ర‌మ‌త్తం చేసిన సీఎం

అమ‌రావ‌తి – ఏపీలో కొన‌సాగుతున్న వ‌ర‌ద ఉధృతిపై సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు ఆరా తీశారు. విజ‌య‌వాడ క‌లెక్ట‌రేట్ లో సోమ‌వారం స‌మీక్ష చేప‌ట్టారు. ఈ సంద‌ర్బంగా స‌హాయ‌క చ‌ర్య‌ల‌పై మంత్రులు దృష్టి సారించాల‌ని స్ప‌ష్టం చేశారు.

ఇదిలా ఉండ‌గా మంత్రి నారా లోకేష్ మంత్రులు ఎలా స‌మ‌న్వ‌యం చేసుకుని ముందుకు వెళ్లాల‌నే దానిపై చ‌ర్చించారు . ఆర్టీజీఎస్ సమాచారంతో క్షేత్ర స్థాయికి బృందాలను పంపించారు. మహానాడు లోతట్టు ప్రాంత ప్రజలను పునరావాస కేంద్రానికి తరలించాల‌ని ఆదేశించారు.

మహానాడు వరద పరిస్థితి గురించి ఎప్పటికప్పుడు సమీక్షించారు. గ‌తంలో ఎన్న‌డూ లేనంత‌గా విజ‌య‌వాడ వ‌ర్షాల ధాటికి విల విల లాడుతోంద‌ని పేర్కొన్నారు. తీవ్ర ఆవేద‌న వ్య‌క్తం చేశారు మంత్రి. ప్ర‌భుత్వం అన్ని స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌డుతోంద‌ని తెలిపారు.

కృష్ణలంక, సింగ్ నగర్ ప్రాంతాల్లో అర్థరాత్రి దాటాక కూడా బోట్ వేసుకుని వెళ్లి బాధితులకు స్వయంగా ఆహారం, నీరు అందించి వచ్చారు చంద్ర‌బాబు నాయుడు.

ఇదిలా ఉండ‌గా రామలింగేశ్వర నగర్ లో నీట మునిగిన నిమ్మల వారి వీధిలో పర్యటించారు మంత్రి సవితమ్మ. వరద బాధితులను పునరావాస కేంద్రాలకు తరలించారు. భోజన, వసతి కల్పించామని, వరద బాధితులకు ప్రభుత్వం అండగా ఉందని భరోసా ఇచ్చారు మంత్రి.

RELATED ARTICLES

Most Popular

Recent Comments