తప్పైందని మన్నించమని కోరిన మంత్రి
అమరావతిః విజయవాడ కనక దుర్గమ్మ గుడి ప్రాంగణంలోని ప్రసాదం కౌంటర్ వద్ద నెలకొన్న మంచినీటి సమస్యపై మంత్రి నారా లోకేష్ స్పందించారు. భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతో వెంటనే ఏర్పాటు చేయాలని ఆదేశించారు. జరిగిన అసౌకర్యానికి మన్నించాలని భక్తులను కోరారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా చూసుకుంటామని హామీ ఇచ్చారు.
అంతకు ముందు భక్తులు నిప్పులు చెరిగారు. సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా తాము తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు ఫిర్యాదు చేశారు. కోట్లాది ఆదాయం గుడికి కలుగుతున్నా ఎందుకని ఏర్పాట్లు చేయడం లేదంటూ ప్రశ్నించారు. ఇదేనా ప్రజా రంజక పాలన అంటూ ప్రశ్నించారు.
దీంతో దెబ్బకు దిగి వచ్చారు మంత్రి నారా లోకేష్. తక్షణమే సమస్యను పరిష్కరించాలని కనకదుర్గమ్మ ఆలయ ఈవోను ఆదేశించారు. హుటా హుటిన అధికారులు అక్కడికి చేరుకున్నారు. యుద్ద ప్రాతిపదికన నీటి వసతిని కల్పించారు.
ప్రతి నిత్యం వేలాది మంది భక్తులు అమ్మ వారిని దర్శించుకునేందుకు వస్తుంటారు. అయినా పాలక మండలి, ఈవో ఏం చేస్తున్నారో అర్థం కావడం లేదంటూ వాపోయారు భక్త బాంధవులు.