NEWSANDHRA PRADESH

ఆంధ్రా యూనివ‌ర్శిటీకి పూర్వ వైభ‌వం

Share it with your family & friends

విద్యా శాఖ మంత్రి నారా లోకేష్

అమ‌రావ‌తి – రాబోయే రోజుల్లో ఆంధ్రా యూనివర్శిటీకి పూర్వ వైభ‌వాన్ని తీసుకు వ‌స్తామ‌ని ప్ర‌క‌టించారు విద్యా, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్‌. గత వైభవాన్ని తిరిగి పొందడమే కాకుండా భారతదేశంలో టాప్ – 3, ప్రపంచ ర్యాంకింగ్స్‌లో టాప్ 100లో ఒకటిగా నిలిపేందుకు తాము కృషి చేస్తున్నట్లు చెప్పారు.

శ‌నివారం ఆంధ్రా యూనివర్సిటీ యాన్యువల్ అల్యూమిని మీట్ ను ఎయు కన్వెన్షన్ సెంటర్ లో నిర్వహించారు. ఓ వైపు ఉన్నత విద్యా సంస్థలు మూడు నాలుగేళ్ల డిగ్రీలకు విద్యార్థులను చేర్పించుకుని, ఉద్యోగాలు చూపించ లేక పోతున్నాయని ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

మరో వైపు కొన్ని నెలలకే ఉద్యోగాలు చూపిస్తున్నాయి కొన్ని సెంటర్లు అని పేర్కొన్నారు. ఈ సీరియస్ సమస్యను యుద్ధ ప్రాతిపదికన తీసుకోవాలని స్ప‌ష్టం చేశారు మంత్రి నారా లోకేష్‌. అంతర్జాతీయ ప్రమాణాలకు తగ్గట్లుగా ఆంధ్రా యూనివర్సిటీని తీర్చిదిద్దుతామని అన్నారు.