టీటీడీ పవిత్రతను కాపాడతాం – లోకేష్
ఇబ్బందులు పెట్టిన వారిని వదిలి పెట్టం
అమరావతి – ఏపీ విద్యా, ఐటీ శాఖ మంత్రి కీలక వ్యాఖ్యలు చేశారు. టీటీడీ పవిత్రతను కాపాడతామని స్పష్టం చేశారు. తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు కలిపారని విని షాక్ కు గురైనట్లు తెలిపారు. ఇందుకు సంబంధించిన రిపోర్ట్ లు కూడా బయట పెట్టడం జరిగిందన్నారు. తిరుమలలో ప్రమాణానికి సిద్ధమని టీటీడీ మాజీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి సవాల్ విసిరారు.
నేను తిరుపతిలోనే ఉన్నా. ప్రమాణానికి సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు నారా లోకేష్. దేవుడి దగ్గర కూడా రాజకీయాలు చేశారని, ప్రజా ప్రభుత్వం టీటీడీని ప్రక్షాళన చేస్తుందని ప్రకటించారు. తిరుమల పవిత్రతను కాపాడే విధంగా చర్యలు చేపడతామని స్పష్టం చేశారు.
ప్రజలు మనపై పవిత్ర బాధ్యత పెట్టారని, హుందాగా నెర వేర్చేందుకు కృషి చేయాలని అన్నారు. పని చేయడంతో పాటు చేసిన పనిని చెప్పుకోవాలని అన్నారు నారా లోకేష్. చట్టాన్ని ఉల్లంఘించి ప్రజలను, కార్యకర్తలను ఇబ్బందిపెట్టిన వారిని వదిలి పెట్టమని హెచ్చరించరాఉ.
చిత్తూరు జిల్లా బంగారు పాళ్యంలో జరిగిన ”ఉత్తమ కార్యకర్త”, “మన టీడీపీ యాప్ ఛాంపియన్స్” సమావేశంలో మంత్రి నారా లోకేష్ శుక్రవారం మాట్లాడారు. భవిష్యత్ కు గ్యారెంటీ 2023-24 కార్యక్రమాన్నివిజయవంతంగా ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు మన టీడీపీ యాప్ ద్వారా ఉత్తమ పనితీరు కనబరిచిన కార్యకర్తలకు ప్రశంస పత్రాలు అందజేశారు.
2019-24 మధ్య వైసీపీ ప్రభుత్వం మనల్ని చాలా ఇబ్బంది పెట్టిందన్నారు. తనపై అక్రమంగా 23 కేసులు నమోదు చేశారని ఆవేదన చెందారు. రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేశారని ఆరోపించారు.