నేతన్నలకు ఏపీ సర్కార్ ఆలంబన
ఏపీ మంత్రి నారా లోకేష్ కామెంట్స్
అమరావతి – రేయింబవళ్లు శ్రమించే నేతన్నలకు రాష్ట్ర ప్రభుత్వం ఆసరాగా ఉంటుందని స్పష్టం చేశారు ఏపీ విద్యా, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్. వారికి మరింత సాయం చేసేందుకు ప్రయారిటీ ఇస్తామన్నారు.
ఆదివారం మంగళగిరి-విజయవాడ బైపాస్‌లోని కొలనుకొండ సమీపంలో పద్మశాలీ ఇంటర్నేషనల్ వెల్ఫేర్ అసోసియేషన్ (PIWA) ఆధ్వర్యంలో చేపడుతున్న నూతన పద్మశాలీ భవన్ శంకుస్థాపన కార్యక్రమానికి విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
పద్మశాలీ భవన్ కు శంకుస్థాపన చేశారు. పద్మశాలీ ఇంటర్నేషనల్ వెల్ఫేర్ అసోసియేషన్ కేంద్ర కమిటీ అధ్యక్షులు స్వర్గం పుల్లారావు దంపతులు పూజా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ మాట్లాడారు.
మంగళగిరిలో అంతర్జాతీయ ప్రమాణాలతో వీవర్స్ శాల ఏర్పాటు చేసి చేనేత కుటుంబాలకు అండగా నిలిచామని చెప్పారు నారా లోకేష్. చేనేత మహిళలకు పెద్దఎత్తున ఆధునిక రాట్నాలను పంపిణీ చేశామని తెలిపారు.
పీఐడబ్ల్యూఏ చేపడుతున్న కార్యక్రమాలు, నూతన పద్మశాలీ భవన్ నిర్మాణానికి సంబంధించిన వివరాలను ఈ సందర్భంగా లోకేష్ అడిగి తెలుసుకున్నారు.