అరుదైన ప్రజా నాయకుడు ఎన్టీఆర్
ఏపీ మంత్రి నారా లోకేష్ కామెంట్
అమెరికా – ఏపీ విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్టీఆర్ వ్యక్తి కాదని మహోన్నత శక్తి అని , ఆయన చూపిన బాట లోనే తాము నడుస్తున్నామని చెప్పారు నారా లోకేష్.
అమెరికా పర్యటనలో భాగంగా అట్లాంటాలో ఎన్నారైల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దివంగత ఎన్టీఆర్ విగ్రహాన్ని నారా లోకేష్ ఆవిష్కరించారు. ఈ సందర్బంగా జరిగిన సభలో ప్రసంగించారు నారా లోకేష్. సూర్య చంద్రులు ఉన్నంత కాలం ఎన్టీఆర్ బతికే ఉంటారని, ప్రజల గుండెల్లో నిక్షిప్తమై ఉంటారని పేర్కొన్నారు.
ఎన్టీఆర్ కేవలం సినిమా, రాజకీయాల కోసం కాకుండా తెలుగు జాతికి , కోట్లాది ప్రజల ఆత్మ గౌరవానికి ప్రతీకగా నిలిచారని అన్నారు . ఎన్టీఆర్ ఒక ఉద్యమం, తెలుగు గర్వానికి చిహ్నం అన్నారు నారా లోకేష్.
మన సంస్కృతి, మన భాష, మన ప్రజల కోసం పోరాడిన గొప్ప నాయకుడు అని కొనియాడారు.
తెరపైనే కాదు, వెలుపల కూడా తెలుగు గుర్తింపును పునర్నిర్వచించాడని పేర్కొన్నారు. మరచి పోలేని పాత్రల నుండి దూరదృష్టి గల నాయకత్వం వరకు, ఎన్టీఆర్ స్పూర్తి దాయకంగా నిలిచే ఉంటారని స్పష్టం చేశారు నారా లోకేష్.