మంగళగిరిని నెంబర్ వన్ చేస్తా
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి
మంగళగిరి – తనను ఆశీర్వదించి అసెంబ్లీకి పంపిస్తే మంగళగిరిని దేశంలోనే నెంబర్ వన్ నియోజకవర్గంగా చేస్తానని ప్రకటించారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.
కోర్టు కేసులతో ఎమ్మెల్యే ఆర్కే అభివృద్దిని అడ్డుకున్నారంటూ ఆరోపించారు. రాజధాని నిర్మాణాలతో లక్ష మందికి పైగా ఉపాధి కల్పిస్తామని హామీ ఇచ్చారు నారా లోకేష్. రాజధానిని అనుసంధానం చేసే రోడ్డును వేయకుండా ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి అడ్డుకున్నాడని మండిపడ్డారు నారా లోకేష్.
తనను గెలిపిస్తే అభివృద్ది అంటే ఏమిటో చూపిస్తానని స్పష్టం చేశారు. ఒక్క చాన్స్ అంటూ జనం నెత్తిన శఠ గోపం పెట్టాడంటూ జగన్ రెడ్డిని ఉద్దేశించి మండిపడ్డారు . సీఎంకు ఊరూరా ప్యాలెస్ లు కట్టుకోవడంపై ఉన్నంత శ్రద్ద ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు చూప లేదని ధ్వజమెత్తారు నారా లోకేష్.
అధికారంలో లేక పోయినా మంగళగిరికి ఐటీ పరిశ్రమను తీసుకు వచ్చానని అన్నారు. 150 మందికి పైగా ప్రస్తుతం ఉపాధి పొందుతున్నారని తెలిపారు. స్వంత నిధులతో 20 సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నానని అన్నారు . 40 వేల మంది స్వర్ణకారులకు ఉపాధి కల్పించేందుకు కృషి చేస్తానని చెప్పారు నారా లోకేష్.