NEWSANDHRA PRADESH

బాజాప్తా రెడ్ బుక్ అమ‌లు చేస్తాం – లోకేష్

Share it with your family & friends

జోగి ర‌మేష్ కొడుకు భూ క‌బ్జాపై కామెంట్

అమ‌రావ‌తి – ఏపీ విద్యా, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ షాకింగ్ కామెంట్స్ చేశారు. జ‌గ‌న్ మోహన్ రెడ్డి హ‌యాంలో చోటు చేసుకున్న దారుణాలు, దాడుల‌కు సంబంధించి బాజాప్తాగా కేసులు న‌మోదు చేస్తామ‌ని ప్ర‌క‌టించారు. ఇందులో వెన‌క్కి త‌గ్గే ప్ర‌స‌క్తే లేద‌న్నారు నారా లోకేష్‌.

మాజీ మంత్రి జోగి ర‌మేష్ కొడుకు జోగి రాజీవ్ భూమి క‌బ్జాల‌కు పాల్ప‌డ్డాడ‌ని, ఈ విష‌యం పోలీసుల విచ‌రాణ‌లో కూడా తేలింద‌ని..అయితే ఆయ‌న తండ్రి మాజీ మంత్రి అని చూస్తూ ఊరు కోవాలా అని ప్ర‌శ్నించారు ఏపీ మంత్రి.

త‌ప్పు చేసిన ఏ ఒక్క‌రినీ వ‌దిలి పెట్టే ప్ర‌స‌క్తి లేద‌ని వార్నింగ్ ఇచ్చారు నారా లోకేష్‌. రేపు లిక్కర్ స్కాం మీద కూడా చర్యలు ఉంటాయ‌ని అన్నారు. చట్టాన్ని ఉల్లంఘించిన వారిని వదిలి పెట్టన‌ని ప్ర‌క‌టించారు.

జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప‌దే ప‌దే త‌న గురించి, తాను చెప్పిన‌ట్టుగా రెడ్ బుక్ గురించి ప్ర‌స్తావిస్తున్నాడ‌ని దీని గురించి క్లారిటీ ఇవ్వాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు నారా లోకేష్. రెడ్ బుక్ అంటే చ‌ట్టాన్ని ఉల్లంఘించిన వారిని చ‌ట్ట ప్ర‌కారం శిక్షించేద‌న్నారు.