మంత్రి నారా లోకేష్ ప్రకటన
మంత్రి నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ కోసం ముందు నుంచి కష్టపడిన నేతలు, కార్యకర్తలు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ప్రతి ఒక్కరినీ గుర్తు పెట్టుకుని వారికి సముచిత స్థానం కల్పిస్తామన్నారు. ఇంకా పదవులు చాలా భర్తీ చేయాల్సి ఉందని, వాటితో కొందరిని ఎంపిక చేయడం జరుగుతుందన్నారు. పదవులు రాలేదని బాధ పడవద్దని సూచించారు. ఎమ్మెల్సీలుగా బలహీన వర్గాలకు ప్రాతినిధ్యం కల్పించామన్నారు. బలహీన వర్గాలపై టీడీపీకి ఉన్న చిత్తశుద్దిని మరోసారి చాటామన్నారు. యువ మహిళలను ప్రోత్సహించాలని గ్రీష్మకు ఛాన్స్ ఇచ్చామన్నారు లోకేష్.
పార్టీలో కోటి మంది సభ్యులయ్యారని , ఈ ఘనత సీఎం చంద్రబాబు నాయకత్వంపై ఉన్న నమ్మకాన్ని తెలియ చేస్తుంద్నారు. కొందరు పదవులపై ఆశలు పెట్టుకున్న వాళ్లు నిరాశకు గురైన మాట వాస్తవమేనని అన్నారు. ఎవరినీ తక్కువ చేయడం లేదని, ప్రతి ఒక్కరినీ గుర్తు పెట్టుకుని వారు చేసిన సేవలకు తగిన రీతిలో త్వరలోనే గుర్తింపు వచ్చేలా చేస్తామని చెప్పారు నారా లోకేష్. నాయకులు, మంత్రులు, ఎమ్మెల్యేల వెంట తిరిగితే పోస్టులు రావని కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా గత ప్రభుత్వ హయాంలో ఎందరో అక్రమ కేసుల బారిన పడ్డారని , వారికి మనో ధైర్యం ఇవ్వాల్సిన బాధ్యత తమపై ఉందన్నారు. అందరికీ సముచిత న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.