పారిశ్రామికవేత్తలకు రెడ్ కార్పెట్ – లోకేష్
భారీ ఎత్తున పరిశ్రమలు ఏపీకి రావాలి
విజయవాడ – ఏపీ ఐటీ, విద్యా, కమ్యూనికేషన్స్ శాఖ మంత్రి నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. పెట్టుబడిదారులు, పారిశ్రామికవేత్తలు, కంపెనీలు ఏర్పాటు చేసేందుకు వచ్చే వారికి రెడ్ కార్పెట్ పరుస్తామని స్పష్టం చేశారు .
విజయవాడలో జరిగిన కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ 4వ సదరన్ రీజినల్ కౌన్సిల్ సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఇటీవల ఎంపిక చేసిన పరిశ్రమల ప్రముఖులను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు నారా లోకేష్.
ఎవరైనా తమ వద్దకు నేరుగా రావచ్చని, ఎలాంటి రూల్స్ అంటూ ఉండవని స్పష్టం చేశారు. తాము టైం ఇవ్వడం కాదు మీరే టైం డిసైడ్ చేస్తే మంత్రులు, ఉన్నతాధికారులు, సంబంధిత శాఖలకు సంబంధించిన ఎక్స్ పర్ట్స్ తో తామే వస్తామని ప్రకటించారు ఏపీ మంత్రి.
ఆగ్రో, ఫుడ్ ప్రాసెసింగ్ , ఐటి, ఫార్మా, మాన్యుఫ్యాక్చరింగ్ , పోర్ట్స్, షిప్పింగ్, లాజిస్టిక్స్ కు సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశారు నారా లోకేష్. అన్ని రంగాలలో ఏపీ ముందంజలోకి రావాల్సిన అవసరం ఉందన్నారు. గత జగన్ రెడ్డి సర్కార్ వీటిని నిర్వీర్యం చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎవరైనా సరే ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తే తాము అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందజేస్తామని ప్రకటించారు ఈ సందర్బంగా నారా లోకేష్.