విశాఖలో టీసీఎస్ డెవలప్ సెంటర్
చంద్రశేఖరన్ తో నారా లోకేష్ సమావేశం
అమరావతి – ప్రముఖ దిగ్గజ సంస్థ టాటా గ్రూప్ కంపెనీ త్వరలోనే విశాఖలో టీసీఎస్ డెవలప్ మెంట్ సెంటర్ ను ఏర్పాటు చేయనుందని తెలిపారు ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్. టాటా గ్రూప్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ చంద్రశేఖరన్ తో సమావేశం అయ్యారు మంత్రి. ఈ సందర్బంగా కీలక అంశాలపై చర్చించారు. ప్రధానంగా సాంకేతికత పరంగా ఏపీతో మరింత కలిసి ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందన్నారు.
ఇదిలా ఉండగా టీసీఎస్ డెవలప్ సెంటర్ ఏర్పాటు వల్ల దాదాపు 10 వేల మందికి పైగా జాబ్స్ వస్తాయని ప్రకటించారు నారా లోకేష్. ఐటీ, లాజిస్టిక్, ఫార్మా, పవర్ సెంటర్ గా విశాఖ మారనుందన్నారు. అంతే కాకుండా టాటా గ్రూప్ విద్యుత్ రంగాలపై కూడా ఫోకస్ పెడుతుందని తెలిపారు.
టాటా పవర్ రూ. 40,000 కోట్ల పెట్టుబడితో సౌర, పవన ప్రాజెక్టులలో 5 GW పైగా అంచనా వేస్తోందని అన్నారు నారా లోకేష్. ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ కోసం లోతైన సాంకేతికత , ఏఐ పరిష్కారాలను ఆవిష్కరించడానికి సంభావ్య సహకారాన్ని కూడా అన్వేషించడం జరిగిందన్నారు.
రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పారిశ్రామికవేత్తలకు మార్గదర్శకత్వం వహిస్తుందన్నారు.