టీడీపీ కూటమికి 150 సీట్లు పక్కా
నారా లోకేష్ బాబు ధీమా
అమరావతి – ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్ పనై పోయిందని , ఇక రాబోయేది టీడీపీ జనసేన బీజేపీ కూటమిదేనని స్పష్టం చేశారు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. ఆయన జాతీయ మీడియాతో మాట్లాడారు. ప్రస్తుతం రాష్ట్రంలో శాసన సభ, లోక్ సభ ఎన్నికలు జరగనున్నాయి.
అసెంబ్లీ స్థానాలకు సంబంధించి 175 స్థానాలకు గాను కనీసం తమ కూటమికి 150కి పైగానే వస్తాయని చెప్పారు. ఇదే సమయంలో లోక్ సభ్ స్థానాలలో 25 స్థానాలకు గాను తమ భాగస్వామ్యానికి కనీసం 23కి పైగానీ ఎంపీ సీట్లు రాబోతున్నాయని తెలిపారు నారా లోకేష్.
రాష్ట్రంలో ప్రజా పాలన రాబోతోందని, జనం తమను గెలిపించేందుకు సిద్దంగా ఉన్నారని, వాళ్లు మార్పు కోరుకుంటున్నారని ఇందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదన్నారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి. ఇంత కాలం జగన్ మోహన్ రెడ్డి అధికారాన్ని అడ్డం పెట్టుకుని దౌర్జన్యం చెలాయించారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రాన్ని 8 లక్షల కోట్ల అప్పులకు తీసుకు వెళ్లిన ఘనత సీఎంకే దక్కుతుందన్నారు .