NEWSANDHRA PRADESH

గెలుస్తా అభివృద్ధి చేస్తా

Share it with your family & friends

నారా లోకేష్ కామెంట్స్

మంగ‌ళ‌గిరి – జ‌గ‌న్ ఎన్ని కుట్ర‌లు చేసినా త‌న గెలుపు ఆప లేడ‌ని అన్నారు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేష్. మంగ‌ళ‌గిరి శాస‌న స‌భ నియోజ‌క‌వ‌ర్గం నుంచి త‌ను ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. గ‌త ఎన్నిక‌ల్లో ఓట‌మి పాల‌య్యారు. తాజాగా త‌న తండ్రి , మాజీ సీఎం, పార్టీ చీఫ్ నారా చంద్ర‌బాబు నాయుడు చేతుల మీదుగా బి ఫారం అందుకున్నారు.

అనంత‌రం నారా లోకేష్ బాబు మీడియాతో మాట్లాడారు. టీడీపీ కూట‌మి గెలుపు ప‌క్కా అని ధీమా వ్య‌క్తం చేశారు. రాష్ట్రంలో జ‌గ‌న్ పాల‌న గాడి త‌ప్పింద‌న్నారు. ప్ర‌జ‌లు తీవ్ర‌మైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నార‌ని ఆవేద‌న చెందారు. మంగ‌ళ‌గిరి నియోజ‌క‌వ‌ర్గాన్ని దేశంలోనే ఆద‌ర్శ నియోజ‌క‌వ‌ర్గంగా మారుస్తాన‌ని ప్ర‌క‌టించారు.

ఇప్ప‌టికే ప‌లు కార్య‌క్ర‌మాలు చేప‌ట్డ‌డం జ‌రిగింద‌న్నారు. గెలిచినా ఓడినా తాను ప్ర‌జ‌లతోనే ఉంటాన‌ని స్ప‌ష్టం చేశారు నారా లోకేష్ బాబు. వ్య‌వ‌స్థ‌ల‌ను నిర్వీర్యం చేసి రాష్ట్రాన్ని అప్పుల కుప్ప‌గా మార్చిన ఘ‌న‌త జ‌గ‌న్ రెడ్డికే ద‌క్కుతుంద‌ని ధ్వ‌జ‌మెత్తారు. ప్ర‌జ‌లు ఆయ‌న‌ను ఇంటికి పంపించేందుకు సిద్దంగా ఉన్నార‌ని చెప్పారు.