NEWSANDHRA PRADESH

ఎలక్ట్రానిక్స్ హబ్ గా తిరుప‌తి

Share it with your family & friends

స్ప‌ష్టం చేసిన నారా లోకేష్

అమ‌రావ‌తి – ఏపీ విద్యా, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఆయ‌న ఢిల్లీలో జ‌రిగిన స‌ద‌స్సులో పాల్గొన్నారు. ఈ సంద‌ర్బంగా ఏపీ దేశంలోనే నెంబ‌ర్ వ‌న్ అయ్యేలా తీర్చి దిద్దుతామ‌ని ప్ర‌క‌టించారు.

తిరుపతిని ఎలక్ట్రానిక్స్ హబ్ గా మారుస్తామ‌ని చెప్పారు నారా లోకేష్. పరిశ్రమదారులు సహకారాన్ని అందించాల‌ని కోరారు . ఇప్పటికే ప్రపంచంలో పేరెన్నిగన్న డిక్సన్, డైకిన్, టిసిఎల్ కంపెనీలు తమ యూనిట్లను ఏర్పాటు చేశాయ‌ని చెప్పారు.

అనంతపురంలో కియా మోటార్స్ ఇప్పటికే పని చేస్తోందని అన్నారు. అనంతపురం, కర్నూలు జిల్లాలను ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్స్ పరిశ్రమ, ఈవి కీలక కేంద్రాలు ఏర్పాటు కానున్నాయని తెలిపారు నారా లోకేష్‌.

అమెరికాలో వాషింగ్టన్ మాదిరిగా ఏపీ పరిపాలన కేంద్రం అమరావతిని తీర్చి దిద్దడంపై త‌మ‌ ప్రభుత్వం దృష్టిసారించినట్లు మంత్రి లోకేష్ చెప్పారు. ఈ సందర్భంగా పరిశ్రమదారులు మాట్లాడుతూ… భారత్ లో మొబైల్ తయారీరంగ అభివృద్ధికి గల అవకాశాలు, అందులో పిఎల్ఐ పాత్రపై గణాంకాలతో వివరించారు.

దేశ వ్యాప్తంగా ఏసీ తయారీ క్లస్టర్లను ఏర్పాటు చేయాల్సి ఉందని, వాటి అవసరం పెరుగుతోందని చెప్పారు. ఎలక్ట్రానిక్స్ రంగంలోమహిళా శ్రామికశక్తి పాత్ర, ప్రాథమిక సమస్యలను కూడా మంత్రికి తెలియజేశారు.

అన్నివిధాలా అనువైన వాతావరణంతో వ్యూహాత్మక పెట్టుబడి కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ ముందుకు సాగుతోందన్నారు. ఎపి అభివృద్ధికి మీ వంతు, సహాయ, సహకారాలు అందించాలని నారా లోకే్ష్ కోరారు.