యూరో కార్డులతో మహిళలకు లాభం
స్పష్టం చేసిన టీడీపీ నేత నారా లోకేష్
మంగళగిరి – తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. మహిళల అభివృద్దికి తాము సహాయ సహకారాలు అందజేస్తామని హామీ ఇచ్చారు. కేవలం రెండు నెలల్లో 50 మంది మహిళా విక్రేతలు తమ సంపాదనలో 200 శాతం వరకు పెరుగుదలను చూస్తారని తెలిపారు.
ఈ సందర్బంగా యూరో కార్డు ద్వారా పైలట్ ప్రాజెక్టును ప్రారంభించడం తనకు చాలా ఆనందంగా ఉందన్నారు నారా లోకేష్. ఈ యూరో కార్డులు విక్రేతను, ముఖ్యంగా వారి ఆరోగ్యాన్ని కాపాడేందుకు ఎర్గోనామిక్ గా రూపొందించడం జరుగుతుందన్నారు .
ఆహారం, ఇతర వస్తువులను విక్రయిస్తూ జీవనం సాగించే మహిళా విక్రేతలకు ఇవాళ 50 ఉచిత యూరో కార్ట్‌లను అందించడం జరిగిందన్నారు నారా లోకేష్. సమాజంలో అట్టడుగున ఉన్న 30 శాతం ఆదాయాన్ని ఆర్జించే వారిని దారిద్య్ర రేఖకు ఎగువకు నెట్టే లక్ష్యంతో దీనిని రూపొందించామన్నారు.
ఈ విశిష్ట కాన్సెప్ట్‌ని ప్రారంభించేందుకు మంగళగిరిని ఎంచుకున్నందుకు ఎన్నారై టీడీపీకి చెందిన గుంటుపల్లి జయకుమార్, మురళీ రాపర్లకు ధన్యవాదాలు తెలియ జేస్తున్నానని పేర్కొన్నారు నారా లోకేష్.