రెడ్ బుక్ లో రాసిన పేర్లు సెటిల్ చేస్తా
నారా లోకేష్ సంచలన వ్యాఖ్యలు
పలాస – తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాము అధికారంలోకి రావడం ఖాయమని జోష్యం చెప్పారు. జగన్ రెడ్డి పాలనలో ఆ పార్టీకి వత్తాసు పలుకుతూ ప్రజలను, ముఖ్యంగా తమ పార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తలను తీవ్ర ఇబ్బందులకు గురి చేసిన ఏ ఒక్కరినీ వదిలి పెట్టే ప్రసక్తి లేదని హెచ్చరించారు నారా లోకేష్.
పలాసలో జరిగిన శంఖారావం సభలో ఆయన ప్రసంగించారు. జగన్ రెడ్డి పాలన అస్తవ్యస్తంగా మారిందన్నారు. రెడ్ బుక్ లో పేర్లు రాసుకున్నానని వారి భరతం పడతానని హెచ్చరించారు. ఇవాళ అన్ని శాఖలకు చెందిన వారంతా వైసీపీకి మద్దతు పలకడం దారుణమన్నారు.
ముఖ్యంగా పోలీస్ వ్యవస్థ జగన్ రెడ్డికి, ఆయన పరివారానికి బేషరతుగా మద్దతు పలకడం బాధగా ఉందన్నారు. అక్రమాలకు అడ్డుగా వస్తున్నాడని ఎమ్మార్వోను పొట్టన పెట్టుకున్నారని, దీనికి పూర్తి బాధ్యత సీఎం జగన్ రెడ్డి వహించాలని ధ్వజమెత్తారు నారా లోకేష్.
అధికారంలకి వచ్చాక తనకు పదవి అక్కర్లేదన్నారు. తమను ఇబ్బందులకు గురి చేసిన వారిని ఊరికే వదల బోమంటూ హెచ్చరించారు.